సివిల్స్‌లో జిల్లా వాసుల ప్రతిభ

జిల్లాలోని లింగాల మండలం దొండ్లవాగు గ్రామానికి చెందిన చప్పిడి సుష్మారెడ్డి సివిల్స్‌లో 96వ ర్యాంకు సాధించారు. సుష్మా సోషియాలజి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రత్యేక సబ్జెక్ట్‌లు ఎంచుకొని ఈ ర్యాంకు సాధించారు.

కడప నిర్మల స్కూల్‌లో 9, నాగార్జున హైస్కూల్‌లో 10వ తరగతి చదువుకున్నారు. విజయవాడ నలంద కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి వరంగల్‌లో రీజినల్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఇంజినీరింగ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనెజ్‌మెంట్‌ను కోల్‌కతాలో పూర్తిచేశారు. ప్రస్తుతం చెన్నయ్‌లో ఐఆర్‌ఎస్ ట్రైనింగ్ చేస్తున్నారు. సాధారణ కుటుంబంలో పుట్టిన సుష్మా కోచింగ్ తీసుకోకుండా ర్యాంకు సాధించారు.

చదవండి :  ఈ రోజు రాచపాలెం అభినందన సభ

సుష్మా తండ్రి నీలకంఠరెడ్డి ఎస్‌బీఐలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

ఇదీ చదవండి!

రెక్కలు కథ

రెక్కలు (కథ) – కేతు విశ్వనాథరెడ్డి

కేతు విశ్వనాథరెడ్డి కథ – రెక్కలు ఆ ‘ముగ్గురూ ఖాకి దుస్తుల్లో ఉన్న ఆడపిల్లలని తెలుస్తూనే ఉంది, వాళ్ళ ఎత్తుల్ని …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: