సిద్దేశ్వరం ..గద్దించే స్వరం (కవిత)

సిద్దేశ్వరం ..గద్దించే స్వరం
రాయలసీమకు ఇది వరం
పాలకుల వెన్నులో జ్వరం
కడితే అది సిద్దేశ్వరం
కాదంటే అది యుద్దేశ్వరం
సాగునీటి ఉద్యమ శరం
తోకతొక్కిన సీమ నాగస్వరం
కృష్ణా-పెన్నార్ ను తుంగలోతొక్కి
కరువు జనుల ఆశలను కుక్కి
సాగరాలను నిర్మించుకుని
మూడుకార్లు పండించుకుని
గొంతెండుతోందని గోస పెడితే
అరెస్టులతో అణచేస్తారా ?
అదిగదిగో కదులుతోంది దండు
ద్రోహులగుండెల్లో ఫిరంగి గుండు
నలుదిశలా కనబడలేదా ?
రాయలసీమ ఉద్యమ జండా
సాగుతోంది సన్నని దారుల గుండా !

చదవండి :  ముత్తులూరుపాడు

– తవ్వా ఓబుళరెడ్డి

(tavva@kadapa.info)

ఇదీ చదవండి!

సూర్య విగ్రహం

నిడుజువ్విలో సుందర సూర్య విగ్రహం!

భారతీయ సంస్కృతిలో సూర్యారాధనకు ఉన్న ప్రాధాన్యత అమితమైనది. కోణార్క్ లోని సూర్యదేవాలయాన్ని ఇందుకు ప్రతీకగా చెప్పుకుంటాం. మన రాష్ట్రంలో ‘అరసవెల్లి’ …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: