
రాచమల్లు రామచంద్రారెడ్డి
సాహిత్యంలో నిబద్ధత అంటే ఏమిటి? ఎంతమేరకు? : 2
సాహిత్యంలో రచయితకు ఉండాల్సిన నిబద్ధత (commitment) గురించి సోదాహరణంగా వివరిస్తూ రారాగా పరిచితులైన సుప్రసిద్ధ విమర్శకులు కీ.శే. రాచమల్లు రామచంద్రారెడ్డి గారు రాసిన వ్యాసమిది. రారా గారు చాలా కాలం క్రితం రాసిన ఈ వ్యాసాన్ని రారా స్మారక సమితి సౌజన్యంతో ‘మిసిమి’ మాసపత్రిక 1992 మే నెల సంచికలో పునః ప్రచురించింది. రారా గారు రాసిన ఈ అమూల్యమైన వ్యాసం నాటి తరం సాహితీకారులకు నిబద్ధత యొక్క ఆవశ్యకతను తెలియచేసింది. ఇది నేటి తరం సాహితీకారులకు, రేపటి తరం సాహితీకారులకు, సాహిత్యాభిలాషులకు ఉపయుక్తం కాగలదు. ‘మిసిమి’ సౌజన్యంతో కడప.ఇన్ఫో వీక్షకుల కోసం ఇక్కడ ప్రచురిస్తున్నాం….
[author image=”https://kadapa.info/wp-content/uploads/2014/09/ramachandrareddy.jpg” ]
1922 ఫిబ్రవరి 28 వ తేదీన కడప జిల్లా పులివెందుల తాలూకా పైడిపాలెం గ్రామంలో జన్మించిన రామ చంద్రా రెడ్డి తెలుగు సాహితీ లోకానికి ” రా.రా” గా ప్రసిద్ధులు. తెలుగు సాహితీ విమర్శలో రా.రా. కు ప్రత్యేక స్థానం ఉంది. ఈయన ఇంజనీరింగ్ పట్టభద్రులు (మద్రాసు). వీరి సంపాదకత్వంలో 1959-63 కాలంలో కడప నుండి వెలువడిన ” సవ్యసాచి ” , 1968-69 కాలంలో వెలువడిన ” సంవేదన ” పత్రికలు తెలుగు సాహిత్యంలో ఒక సంచలనం కలిగించాయి. వీరి ” అనువాద సమస్యలు ” గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అలసినగుండెలు (కథా సంపుటి), సారస్వతవివేచన, వ్యక్తి స్వాతంత్ర్యం- సమాజశ్రేయస్సు , బాల సాహిత్యం, నాటికలు, అనువాద రచనలను చేశారు. మాస్కో లోని ప్రగతి ప్రచురణాలయంలో అనువాదకులుగా కూడా పని చేశారు. రా.రా 1988 నవంబరు 25న తుది శ్వాస వదిలారు.
[/author]