సాగునీళ్ళలో సీమకు

సాగునీళ్ళలో సీమకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన కోస్తా ఇంజనీర్

సాగునీళ్ళలో సీమకు జరిగిన మోసమేమిటి?

కీ.శే కె శ్రీరామకృష్ణయ్య (శ్రీరామక్రిష్ణయ్య) గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇరిగేషన్ ఇంజనీరుగా పని చేసి పదవీ విరమణ పొందినారు. గుంటూరు జిల్లాలోని రేపల్లె తాలూకాలో భాగమైన బేతపూడికి చెందిన వీరు సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రులు. రాయలసీమకు సంబంధించి సాగునీటి పథకాల ప్రతిపాదనలు తయారు చేయడంలో వీరు పాలు పంచుకున్నారు. వీరి కృషిని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప జిల్లాలోని బ్రహ్మంసాగర్ జలాశయం (ఇది తెలుగుగంగ పథకంలో బాగంగా ఉంది) వద్ద శ్రీరామకృష్ణయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.

చదవండి :  గాలేరు నగరి సుజల స్రవంతి

ఇక విషయానికి వస్తే శ్రీరామకృష్ణయ్య గారు 1986లో 125 పేజీలతో కూడిన ‘The Story of Pennar Basin – AndhraPradesh’ అనే పుస్తకం ఒకటి రాశారు. అందులో పెన్నా పరీవాహక ప్రాంతం, అందులో భాగంగా ఉన్న రాయలసీమ ప్రజలు పడుతున్న కష్టాలను రేఖా మాత్రంగా సృశించారు. అదే సందర్భంలో రాయలసీమకు సాగునీటి విషయంలో జరిగిన మోసాలను కూడా స్పృశించిన ఆయన, ఆ మోసాలకు పాలకులు, ప్రభువులు, అధికారులు, ఇంజనీర్లు కలిసి రాయలసీమ ప్రాంతానికి పరిహారం ఏ విధంగా చెల్లించవచ్చో కూడా చెప్పారు.

చదవండి :  దైవత్వాన్ని నింపుకున్న మానవుడు వైఎస్సార్

రాయలసీమ సాగునీటి విషయంలో ‘The Story of Pennar Basin – Andhrpradesh’లో శ్రీరామకృష్ణయ్య గారు పేర్కొన్న అభిప్రాయాలు కడప.ఇన్ఫో వీక్షకుల కోసం, ఈ పుస్తక రూపంలో…

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: