sannapureddy
సాటి పురస్కార గ్రహీతలతో, కార్యక్రమ అతిధులతో సన్నపురెడ్డి వేంకటరామిరెడ్డి.

‘కొత్త దుప్పటి’కి పురస్కారం

విశాలాంధ్ర ప్రచురించిన ‘కొత్త దుప్పటి’ కథల సంకలనం (సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి కథలు)  పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారానికి (2011) ఎంపికైంది. హైదరాబాదులోని ఎన్టీఆర్‌ కళామందిరంలో గురువారం జరిగిన కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరావు చేతుల మీదుగా రచయిత సన్నపురెడ్డి వెంకట్రామి రెడ్డి పురస్కారాన్ని అందుకున్నారు.

పురస్కారాల ప్రదానోత్సవంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ.. తెలుగు భాషా సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అహర్నిశలు కృషి చేస్తుందని చెప్పారు.

చదవండి :  చనుబాలు (కథ) - సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

పురస్కార గ్రహీతలు ఒక్కొక్కరికి 20,116 నగదు, శాలువా, పురస్కార పత్రం అందజేశారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య కె.ఆశీర్వాదం, డాక్టర్‌ జె.చెన్నయ్య, ఆర్‌.రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి!

రాయలసీమ రైతన్నా

ఒక్క వాన చాలు (కవిత) – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

వాన మాట విన్పిస్తే చాలు చెవులు – అలుగుల్ని సవరించుకొనే చెరువులవుతున్నాయి మేఘాల నీడలు కదిలితే చాలు కళ్లు – …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: