‘కచ్చితంగా ఒంటిమిట్టలోనే నిర్వహించాల’

కడప: జిల్లా పట్ల వివక్ష చూపుతున్న ప్రభుత్వం శ్రీరామనవమి ఉత్సవాలను ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో చేపడితే సహించేదిలేదని, ప్రభుత్వం నిర్వహించే ఉత్సవాలను కచ్చితంగా ఒంటిమిట్టలోనే నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నజీర్అహ్మద్ డిమాండ్ చేశారు.

బుధవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… భద్రాచలంలోని శ్రీరామచంద్రమూర్తికి రాష్ట్ర ప్రభుత్వం పట్టువస్త్రాలు, పీతాంబరాలు సమర్పించేదని, ప్రస్తుతం రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో భద్రాచలం తెలంగాణ ప్రభుత్వంలోకి వెళ్లిందన్నారు. ఈ నేపథ్యంలో భద్రాచలం తర్వాత అంతటి ప్రాధాన్యత కల్గిన ప్రాంతం ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయమని వివరించారు. ఇది 13వ శతాబ్ధంలో నిర్మించినట్లు చరిత్రకూడా చెబుతున్నదని పేర్కొన్నారు.

చదవండి :  భాగవతం పుట్టింది ఒంటిమిట్టలో..!

కడప జిల్లాపై వివక్ష చూపుతున్న ప్రభుత్వం శ్రీరామనవమి ఉత్సవాలను ఒంటిమిట్టలో కాకుండా విజయనగరం జిల్లాలో నిర్వహించేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

జిల్లాపై చూపుతున్న వివక్షను వీడి ప్రభుత్వం ఒంటిమిట్ట కొదందరామయ్యకు పట్టాభిషేకం, ఉత్సవాలను నిర్వహించి పట్టుపీతాంబరాలు, తలంబ్రాలు ప్రభుత్వం అందించాలని చెప్పారు. లేకపోతే ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు.

మొత్తానికి ప్రభుత్వం కడప జిల్లాలో ఉన్నందున దేవుడి ఉత్సవాల విషయంలోనూ వివక్ష చూపుతుందేమోనన్న ఆందోళన జిల్లావాసులకు కలుగుతోంది. ఇది మంచి పరిణామం కాదు. ప్రభుత్వం ప్రజలలో ఇటువంటి భావన కలగకుండా ఉండేందుకు తగిన చర్యలు చేపట్టి జిల్లా ప్రజలలో విశ్వాసాన్ని కల్పించాలి. అయినా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తుందా?

చదవండి :  భక్త కన్నప్పది మన కడప జిల్లా

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – రెండో భాగం

రాయలసీమలో హైకోర్టు కుండల్లో నీళ్ళు పొరుగు జిల్లాలకు, మబ్బుల్లో నీళ్ళు కడపకు గ్రోత్ సెంటర్స్‌గా ఎంపిక చెయ్యడానికి రాయలసీమలో ఎక్కడైనా …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: