శివశివ మూరితివి

శివశివ మూరితివి గణనాతా – భజన పాట

కోలాట కోపుల్లో తాలుపుగట్టి మొదటిది. ‘శివశివ మూరితివి’ అనే ఈ పాట తాలుపుగట్టి కోపుల్లో కడప జిల్లాలో జానపదులు పాడుకునే గణపతి ప్రార్థనా గీతమిది..

వర్గం : భజన పాటలు

శివశివ మూరితివి గణనాతా – నువ్వు
శివునీ కుమారుడవు గణనాతా ||శివ||

బుద్ది నీదే బుద్ది నీదే గణనాతా
ఈ జగతి గొలుచు దేవుడవు గణనాతా ||శివ||

సదువు నీదే సాము నీదే గణనాతా
సారస్వతి నీకు దండం గణనాతా ||శివ||

చదవండి :  ఓ రాయలసీమ రైతన్నా ! - జానపద గీతం

బాపనోళ్ళు నిన్ను గొలువ గణనాతా
బెమ్మదేవుడందురయ్యా గణనాతా ||శివ||

కోమటోల్లు నిన్ను గొలువ గణనాతా
కోటి లాభమందురయ్య గణనాతా ||శివ||

కాపోల్లు నిన్ను గొలువ గణనాతా
కాడిమేడి యందురయ్య గణనాతా ||శివ||

వడ్డోల్లు నిన్ను గొలువ గణనాతా
భలే దొడ్డ దేవుడందురయా గణనాతా ||శివ||

ఈ సిగిసెర్ల నిన్ను గొలువ గణనాతా
జనుల కార్యాల్ని చక్కబెట్టు గణనాతా ||శివ||

చదవండి :  బావా... నన్ను సేరుకోవా! - జానపద గీతం

పాడిన వారు: డా. సి కృష్ణారెడ్డి, పులివెందుల

సేకరించిన వారు:

ఇదీ చదవండి!

కడప-సామెతలు-ఇ

కడప జిల్లా సామెతలు – ‘అ’తో మొదలయ్యేవి

‘అ‘తో మొదలయ్యే కడప జిల్లా సామెతలు అందరూ బాపనోల్లే, గంప కింద కోడి ఏమైనట్లు? అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: