
ప్రమాణ స్వీకారం చేసినారు…ఆయనొక్కడూ తప్ప!
జిల్లా నుండి గెలుపొందిన శాసనసభ్యులలో తొమ్మిది మంది గురువారం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసినారు. పులివెందుల శాసనసభ్యుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, మేడామల్లికార్జునరెడ్డి (రాజంపేట), శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), శ్రీనివాసులు (రైల్వేకోడూరు), రఘురామిరెడ్డి (మైదుకూరు), ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), అంజాద్‌బాషా (కడప), జయరాములు (బద్వేలు), రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి (ప్రొద్దుటూరు)లు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి మాత్రమే ప్రమాణ స్వీకారం చేయలేదు.
అక్షర క్రమంలో ఎమ్మెల్యేలతో వరుసగా ప్రమాణం చేయిస్తుండగా, రవీంద్రనాథ్‌రెడ్డి పేరు పిలిచే సరికి రాహుకాలం వచ్చింది. దీంతో రవీంద్రనాథ్‌రెడ్డి.. తన పేరు పిలిచినా వెళ్లలేదు. కార్యక్రమం అనంతరం జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈయన శుక్రవారం ప్రమాణం చేయనున్నారు.
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి (పులివెందుల), మేడా మల్లికార్జునరెడ్డి (రాజంపేట),అంజాద్‌బాషా (కడప), జయరాములు (బద్వేలు), రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి (ప్రొద్దుటూరు), రవీంద్రనాథ్‌రెడ్డి (కమలాపురం)లు మొదటి సారి శాసనసభ్యులుగా గెలుపొందారు.