ysrcp

బాబు పాలనలో ప్రజలకు ఇక్కట్లు

తెదేపా అధినేత చంద్రబాబు పాలనలో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారని వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గుర్తు చేశారు. నాటి పాలనలో విసిగిపోయే వైఎస్‌కు అధికారం అప్పగించి.. ఎన్నో మేళ్లు పొందారని ఆమె కడపలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో వివరించారు. వివిధ కూడళ్లలో ఆమె రోడ్‌షోలు నిర్వహించారు.

బిల్టప్, రామకృష్ణ పాఠశాల కూడలి, చెన్నూరు బస్టాండు, కృష్ణ చిత్రమందిరం, అప్సర కూడలి, ఆలంఖాన్‌పల్లెలో కార్యక్రమం కొనసాగించారు. ఆయా ప్రాంతాల్లో ఆమె చంద్రబాబుపై గురిపెట్టి ప్రసంగించారు. తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన పలు పథకాలు రద్దు చేశారని నిందించారు. బాలికలు, విద్యార్థులకు నష్టం కలిగించినట్లు ఆరోపించారు.బాబు చెట్టును చూపి కాయలమ్ముకొనే వ్యక్తి అని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెబుతున్న ఆయన నాడు ఒప్పంద విధానాన్ని ఎందుకు తీసుకు వచ్చారని నిలదీశారు. లాభాల్లో నడుస్తున్న 56 పరిశ్రమలను మూసివేసినట్ల తెలిపారు.

చదవండి :  ఉత్తుత్తి వాగ్దానాలతో మళ్ళా కడప నోట మట్టికొట్టిన ప్రభుత్వం

 అంతకు ముందు మైదుకూరులో వైఎస్ఆర్సిపి జనపథం బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. చంద్రబాబు 9 ఏళ్ల పరిపానలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ఓట్లు, సీట్లు కోసం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

రాష్ట్ర బడ్జెట్టే లక్షా 30వేల రూపాయలని, రైతుల రుణాలు లక్షా 27వేల కోట్లు ఉంటే ఎలా మాఫీ చేస్తారు? అని ప్రశ్నించారు. ఆయన అవినీతిపరుడు కాబట్టే ఉద్యోగస్థులందని అవినీతిపరులన్నారన్నారు. హైదరాబాద్ను అభివృద్ధి చేశానంటున్నారు. ఆయన నిక్కర్లేసుకున్నప్పుడే హైదరాబాద్ ఐదవ స్థానంలో ఉంది. బీసీలను నిర్వీర్యం చేసిన వ్యక్తి. వందలాది మంది చేనేత కార్మికుల ఆత్మహత్యలకు కారకుడు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీని తెలుగుకాంగ్రెస్గా మార్చారన్నారు.

చదవండి :  అలిగిన తులసి

రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపే సత్తా జగన్కే ఉందని విజయమ్మ చెప్పారు. కౌన్సిలర్లు గెలిస్తే ఎమ్మెల్యేలు గెలిచినట్లేనని, ఎమ్మెల్యేలు గెలిస్తే జగన్ గెలిచనట్లేనని, జగన్ గెలిస్తే వైఎస్ఆర్ సీపీ గెలిచినట్లేనని ఆమె అన్నారు. 30 సంవత్సరాలపాటు వైఎస్ఆర్ కుటుంబాన్ని ఆదరించిన ప్రజలకు రుణపడి ఉంటామన్నారు.

వైఎస్ఆర్ కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. ప్రజలపై ఒక్క పైసా పన్ను భారం పడకుండా పరిపాలన వైఎస్ఆర్ వల్లే సాధ్యమైందన్నారు.

లక్షా 20వేల మంది మహిళలకు అభయహస్తం పథకం వైఎస్ఆర్ అందించారని గుర్తు చేశారు. మహిళలకు పావలావడ్డీ రుణాలను తీసుకొచ్చిన ఘనత ఆయనదేన్నారు. సామాన్యప్రజలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆయనదేనని చెప్పారు. రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం జలయజ్ఞాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు.

చదవండి :  ఈతకొలను నిర్మాణానికి భూమిపూజ

ఇదీ చదవండి!

బుగ్గవంక

బుగ్గవంక రిజర్వాయర్ సొగసు

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: