తెలుగుజాతి ‘వేగు చుక్కలు’ అన్నమయ్య, వేమన, పోతులూరి వీరబ్రహ్మం

    వేగుచుక్కలు పుస్తకావిష్కరణ

    తెలుగుజాతి ‘వేగు చుక్కలు’ అన్నమయ్య, వేమన, పోతులూరి వీరబ్రహ్మం

    కడప: కడప జిల్లాలో పుట్టి తెలుగుజాతికి వేగుచుక్కలుగా వెలుగొందిన అన్నమయ్య, వేమన, పోతులూరి వీరబ్రహ్మంలు సమాజిక రుగ్మతలపై ఆనాడే తమ కలాలను ఝులిపించి, గలమెత్తారని, వీరిలో వేమన తన ధిక్కారస్వరాని బలంగా వినిపించారని ఆదివారం కడపలో జర్గిన “వేగుచుక్కలు” పుస్తక పరిచయ సభలో వక్తలు కొనియాడారు.

    యోగివేమ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యాపకురాలు రచయిత్రి ఎంఎం వినోదిని రచించిన వేగు చుక్కలు పుస్తకావిష్కరణ సభ జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం వేదికగా జరిగింది. ఈ సందర్భం గా తెలుగు భాషోద్యమకారుడు స.వెం.రమేష్‌ ప్రసంగిస్తూ స్థానిక భాషకు ప్రోత్సాహంతో పాటు పరిపాలన కొనసాగించినప్పుడే తెలుగుజాతి ఒక్కటిగా ఉంటుందన్నారు.ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ కోర్సులను తమిళ మాద్యమంలో ఏర్పాటు చేసుకోగలిగిన బలం స్థానిక భాష వల్లనేనన్నారు. వేమన వంటి ధిక్కార కవి భారతదేశంలో మరొకరు లేరన్నారు. వేమన అన్నమయ్య వీరబ్రహ్మం సాహిత్యం లో దళితతత్వాన్ని వినోదిని అన్వేషించారన్నారు. భారతీయ సమాజం దళితీకరణ చెందవలసిన ఆవశ్యకతను వేగు చుక్కలు పుస్తకం తెలియజేస్తుందన్నారు.

    చదవండి :  గో'దారి' సరే.. పెన్నా పుష్కరాల ఊసెత్తరేం?

    కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, భాషల అభివృద్ది మండలి సభ్యులు ఆచార్య డాక్టర్ కేతు విశ్వనాధరెడ్డి మాట్లాడుతూ ప్రాచీన కవులను సానుకూల దృష్టితో చూడాలని కులాన్ని ప్రతిపాదించకూడదన్నారు. అస్తిత్వవాద దృక్పదంతో అన్నమయ్య, వేమన వీరబ్రహ్మం, సాహిత్యాన్ని వినోదిని విమర్శ చేశారన్నారు.

    ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ దళిత బహుజన దృక్పదంతో రాసిన ‘వేగు చుక్కలు’ ప్రాచుర్యం పొందుతోందన్నారు.

    రచయిత్రి వినోదిని మాట్లాడుతూ ప్రాచీన కవుల్లో సామాజిక దృక్పథంతో రచన చేసింది అన్న మయ్య వీరబ్రహ్మం వేమనలే అన్నారు. వారి సాహిత్యంపై పరిశోధన పుస్తకం రచించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. జన విజ్ఞాన వేదిక వేగు చుక్కలు పుస్తకానికి శాస్త్ర ప్రచారం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

    చదవండి :  పులివెందుల జేఎన్‌టీయు ఇంజనీరింగ్ కళాశాలకు ప్రత్యేక హోదా

    కార్యక్రమంలో సాహితీ ప్రముఖులు డాక్టర్‌ పుత్తా బాలిరెడ్డి, డాక్టర్‌ మల్లెమాల వేణుగోపాల్‌రెడ్డి, కథా రచయిత తవ్వా ఓబుల్‌రెడ్డి, డాక్టర్‌ మూలమల్లికార్జునరెడ్డి, కట్టా నరసింహులు, శశిశ్రీ, యోవేవి కులసచివులు సాంబశివారెడ్డి, జె.వి.వి ప్రతినిధులు ఎ. రఘునాధరెడ్డి, డాక్టర్ సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *