గురువారం , 26 డిసెంబర్ 2024

వెనుకబడిన జిల్లాల మీద ధ్యాస ఏదీ?

మొన్న పద్దెనిమిదో తేదీ ఈనాడులో వచ్చిన వార్తాకథనంలో రాష్ట్రంలో పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చెయ్యడానికి ఎంపిక చేసిన 11 ప్రాంతాల జాబితా ఇచ్చారు:

పైడి భీమవరం – శ్రీకాకుళం జిల్లా

అచ్యుతాపురం – విశాఖపట్నం జిల్లా

నక్కపల్లి – విశాఖపట్నం జిల్లా

భీమునిపట్నం – విశాఖపట్నం జిల్లా

కాకినాడ – తూర్పుగోదావరి జిల్లా

కంకిపాడు – కృష్ణా జిల్లా

గన్నవరం – కృష్ణా జిల్లా

జగ్గయ్యపేట – కృష్ణా జిల్లా

కొప్పర్తి – కడప జిల్లా

ఏర్పేడు-శ్రీకాళహస్తి – చిత్తూరు జిల్లా

శ్రీసిటీ – చిత్తూరు జిల్లా

18 ఎప్రిల్ నాటి 'ఈనాడు' కథనం
18 ఎప్రిల్ నాటి ‘ఈనాడు’ కథనం

అందుబాటులోని నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, మౌలిక సదుపాయాలను పరిగణనలోకి తీసుకుంటూ ఎంపికచేసిన ప్రాంతాలివి. చిత్రమేమిటంటే ఈ ప్రాంతాలకు కనీసం 50 కి.మీ. దూరంలోనే నౌకాశ్రయాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారట! కడప నగరానికి పడమటి దిక్కునున్న కొప్పర్తి నుంచి కృష్ణపట్నం పోర్టు కనీస దూరం గూగుల్ మ్యాప్స్ ప్రకారం 212 కిలో మీటర్లు! 50 కి.మీ. లెక్క ఇక్కడ సరిపోవడం లేదే? తీరా ఆచరణకొచ్చేసరికి కొప్పర్తి ఈ జాబితాలో ఉంటుందా ఊడుతుందా? అనేదొక సందేహమైతే రాయలసీమలోని అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టడానికే కోస్టల్ కారిడార్ అనే అందమైన పేరు పెట్టారా అనేది ఇంకో సందేహం. కొప్పర్తి పేరు ఈ జాబితాలో లేనట్లైతే ఇది కేవలం కోస్తా జిల్లాలకు సంబంధించిన ప్రణాళిక అని, రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ఇంకో ప్రణాళిక ఉంటుందేమోనని ఆశించడానికి వీలుండేది. ఇప్పటికైతే అన్నీ సందేహాలే కలుగుతున్నాయి. రాయలసీమలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విదిలింపులే గతా లేక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమైనా దయచూపుతుందా అనే విషయం తేలడం లేదు.

చదవండి :  'చంద్రబాబు మాట నిలుపుకోవాల'

కొన్ని నెలల కిందట చంద్రబాబునాయుడు గారు ఆంధ్రప్రదేశ్‌లోకి, అందునా ప్రత్యేకించి చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోకి పెట్టుబడులను ఆహ్వానించడానికి బెంగళూరు వచ్చారు. ఆయన చాలా కష్టపడుతున్నారు. అందులో సందేహం లేదు. పెట్టుబడులను ఆకర్షించడానికి దేశదేశాలు తిరుగుతున్న ఆయన, స్వదేశీ ఇన్వెస్టర్ల కోసం దేశమంతా తిరగడం కూడా తప్పు కాదు. సందేహమల్లా ఆయన ఎంచుకున్న వ్యూహం పట్లనే. బెంగళూర్లో ఆయన చెప్పిన మాటల సారాంశం ఏమిటయ్యా అంటే ‘బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కర్ణాటకలో ఉంది. ఐనా మీరు (పెట్టుబడిదారులు) రాకపోకలు, వస్తురవాణా కోసం ఆ విమానాశ్రయాన్ని వాడుకుని కర్ణాటకలో కాకుండా అక్కడికి అతి దగ్గర్లో ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో హిందూపురం, అనంతపురం, కుప్పం లాంటిచోట్ల పెట్టుబడులు పెట్టండి’ అని! ఒకవైపు బెంగళూరు విమానాశ్రయ సేవలను వాడుకుంటూ ఇంకోవైపు కర్ణాటకకు రావలసిన పెట్టుబడులను తన్నుకుపోవాలని చేసిన ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. కర్ణాటక, పొరుగునే ఉన్న తమిళనాడు కూడా అప్రమత్తమై, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా దక్కడానికి వీల్లేదని గళమెత్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదాతో పెట్టుబడిదారులకు పన్నురాయితీలు, ఇతర అదనపు ప్రోత్సహకాలు దక్కితే అది తమ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా ఉందనే తప్పుడు సంకేతాలు అందడం వల్లే ఇలా జరిగింది. అంతకు ముందు హీరో హోండాను చిత్తూరు జిల్లాకు ఆకర్షించిన చంద్రబాబునాయుడి చాణక్యాన్ని ఆ రాష్ట్రాలు మరిచిపోలేదు. పైగా దక్షిణభారతంలో బి.జె.పి. కాస్త బలంగా ఉండేది కర్ణాటకలోనే. ఆంధ్రప్రదేశ్ కోసం ఆ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా మోదీ ప్రభుత్వం వ్యవహరించబోదన్నదీ స్పష్టమే!

చదవండి :  చంద్రబాబు కోసం వైఎస్ రెకమండేషన్

మరి దీనికి పరిష్కారమేమిటి?

sivarama

భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి అంతర్జాతీయ విమానాశ్రయాలు అత్యంత కీలకంగా పరిణమించినందువల్ల రాష్ట్రంలోని అంతర్జాతీయ విమానాశ్రయాల ప్రతిపాదనలను ఒకసారి పరిశీలిద్దాం. పై బొమ్మ శివరామకృష్ణన్ కమిటీ నివేదికలోనిది. దాంట్లో ఒక్కో విమానాశ్రయం పరిధి 150 కిమీ దూరం వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఐతే ఆ బొమ్మను చూడగానే కొట్టొచ్చినట్టు కనబడే లోపమేమిటంటే ఇటుపక్కన బెంగళూరు, పై పక్కన హైదరాబాదు విమానాశ్రయాల పరిధిని అంత ప్రముఖంగా చూపించిన ఆ బొమ్మలో చెన్నయ్ విమానాశ్రయ పరిధిని చూపించనేలేదు! చూపినట్లైతే తిరుపతి వల్ల పెరిగే “అదనపు పరిధి” అతిస్వల్పమని తేటతెల్లమయ్యేది. ఆ బొమ్మలో చూపినదాన్ని బట్టే రాయలసీమలో ఒక మూలనున్న తిరుపతిని కేంద్రంగా ఎంచుకున్నట్లైతే బెంగళూరు విమానాశ్రయాన్ని లెక్కలోకి తీసుకున్న తర్వాత కూడా కర్నూలు జిల్లా పూర్తిగానూ, అనంతపురం జిల్లాలో కడపఅధికభాగం, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని భాగాలు పారిశ్రామికాభివృద్ధిలో పాలుపంచుకునే అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోతాయి. అలా కాకుండా ఉండాలంటే రాష్ట్ర దక్షిణ భాగంలోని అన్ని జిల్లాలకు “సమదూరంలో” అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించడానికిగానూ పైన పేర్కొన్న ఐదు జిల్లాలకు చిత్తూరు జిల్లాను కూడా కలిపి మొత్తం ఆరు జిల్లాలకు నడిబొడ్డున ఉన్న నగరాన్ని నిర్ణయించే విషయంలో పురపాలక శాఖామంత్రి నారాయణ గారి సలహా తీసుకుని ఉంటే బాగుండేది. ప్రతిపాదిత ప్రాంతాలకు “సమదూరంలో” ఉండే నగరాలను ఎంపిక చెయ్యడంలో ఆయనకు మంచి అనుభవముంది కదా?

చదవండి :  కడపపై మరోసారి ఈనాడు అక్కసు

రాష్ట్రప్రభుత్వం వెనుకబడిన జిల్లాల అభివృద్ధిని వేగవంతం చేసేలా ఇప్పటికైనా దిద్దుబాటుచర్యలు తీసుకోకపోతే ప్రాంతీయ అసమానతలు అంతకంతకూ పెరిగిపోవడం ఖాయం. పై కథనంలో పేర్కొన్న “వలయాల” విషయమే తీసుకున్నా మొక్కుబడిగానో, కంటితుడుపుగానో 11 ప్రాంతాలను పేర్కొన్నప్పటికీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో చివరికి అభివృద్ధి చెందబోయేది విశాఖపట్నం, తూ.గో., కృష్ణా, నెల్లూరు జిల్లాలు మాత్రమేనని అదే కథనంలో స్పష్టంగానే ఉంది.

కొసమెరుపు:

ఆహారశుద్ధి, ఆటోమొబైల్, టెక్స్ టైల్, ఔషధ, వైద్యపరికరాలు, ఎలెక్ట్రానిక్స్, ఏరోస్పేస్ పరిశ్రమలకు కొప్పర్తి అనుకూలమని ఆ కథనంలో ఊదరగొట్టాక రెండురోజులు తిరక్కుండానే 21న వచ్చిన ఇంకో కథనంలో కడప జిల్లాలో సిమెంటు పరిశ్రమలు తప్ప ఇంకే రకమైన పరిశ్రమలూ స్థాపించబోయేది లేదని కుండబద్దలు కొట్టిన ప్రభుత్వం:

వెనుకబడిన జిల్లాల
21 ఏప్రిల్ నాటి ఈనాడు కథనం

– త్రివిక్రమ్

(trivikram@kadapa.info)

రచయిత గురించి

కడప జిల్లా సమగ్రాభివృద్ది కోసం పరితపించే సగటు మనిషీ త్రివిక్రమ్. సాహిత్యాభిలాషి అయిన త్రివిక్రమ్ తెలుగును అంతర్జాలంలో వ్యాపితం చేసేందుకు ఇతోధికంగా కృషి చేశారు. కొంతకాలం పాటు అంతర్జాల సాహితీ పత్రిక ‘పొద్దు’ సంపాదకవర్గ సభ్యులుగా వ్యవహరించినారు. అరుదైన ‘చందమామ’ మాసపత్రిక ప్రతులను ఎన్నిటినో వీరు సేకరించినారు. చింతకొమ్మదిన్నె మండలంలోని ‘పడిగెలపల్లి’ వీరి స్వస్థలం.

ఇదీ చదవండి!

వన్ టౌన్ సర్కిల్

కడప రుచుల కేంద్రం వన్ టౌన్ సర్కిల్

నేను పెద్దగా రుచులు తెలిసినవాణ్ణి కాను. రుచుల విషయంలో నాది మా నాన్న తరహా. ఏదైనా పదార్థం తినేటప్పుడు ఎంత …

11 వ్యాఖ్యలు

  1. మఱ్ఱిపూడి మహోజస్

    ప్రతి జిల్లానీ ఒక విశాఖో, హైదరాబాదో చేయడం సాధ్యం కాదు. ఇందులో కేవలం రవాణా సౌకర్యాల లెక్కలే కాక వనరులూ, మనుషుల మెంటాలిటీ, శాంతిభద్రతల్లాంటి అంశాలు కూడా ఉంటాయి. రాయలసీమ సోదరులకు కష్టంగా నిష్టూరంగా అనిపించినా ఒక వాస్తవం చెబుతాను. ఏమీ అనుకోకండి. రాయలసీమ సమాజం శాంతియుతమైనది కాదు. అక్కడ చట్టానికి భయపడేవారూ, ఒక నియమ నిబంధనలకీ, హయ్యర్ ఆథారిటీకి లొంగేవారూ ఎవరూ లేరు. అందరూ కింగులే. అందరూ రాయలే. అందుచేత ఎవరూ అక్కడ వ్యాపారం చెయ్యలేరు. ఉద్యోగాలు కల్పించలేరు. అసలు అక్కడ స్టూడెంట్స్ అయ్యవార్లకి నమస్కారం కూడా పెట్టరు. ఎలా అభివృద్ధి చెయ్యాలి? ఎవరిని చెయ్యాలి? మీరే చెప్పండి.

    • అయ్యా మఱిపూడి మహోజస్ గారు.

      మీ వ్యాక్యలో ఉదహరించిన “<>”__________ ఈ వ్యాక్యలకు ఆధారాలేంటో చెప్పగలరా..? వీటికి ఏ ప్రమాణికాలను తీసుకొని మీరు వ్యాక్యానించారో చెప్పగలరా..? రాయలసీమలో శాంతియుత సమాజం లేకుండా వుందనే అనుకొందాం. మరి అక్కడ మద్య తరగతి, సామాన్య ప్రజలు ఎలా జీవనం సాగిస్తున్నారు.? భయపడుతూనా..? లేక శాంతియుత నగరాలకు వలస వెళ్లి జీవనం సాగిస్తున్నారా..? మీకు ఈ విషయంలో అవగాహన వున్నదా..?

      “<>”______ ఎవరు వీళ్లు..? సామాన్య జనవస్రవంతినా..? లేక రాజకీయ నాయుకలా.? రాజకీయ నాయుకలైతే.. ఒక్క రాయలసీమలో మాత్రమే అలా చట్టాలకు భయపడని వారున్నారా..? లేక మొత్తం దేశమంతటా వున్నారా..?

      “<>”___________ అవునా..? అబ్బా మీ అవగాహనకు నా జోహర్లు సారూ. ఇక్కడెవరూ వ్యాపారాలు చేయట్లేదా..? మరి ఆంద్ర రాష్ట్ర మంతటీకి…. పోనీ రాయలసీమ జిల్లాలంతటికీ సెకెండ్ బాంబే అని పిలువ బడుతున్నా “ప్రొద్దుటూర్” లో కొన్ని వందల కోట్ల వ్యాపారాలు జరుగుతున్నాయే..!! ఎలాగంటారు.? మీకో విషయం తెలుసో లేదో.. చెబుతున్నాను వినండి. తెలుగు సినీ పరిశ్రమకు వందల కోట్లలో “సినీ ఫైనాన్స్” చేస్తున్నది ఎవరు..? కోస్తా, సర్కారు జిల్లా వాసులా..? వెళ్ళి సమాచారం సేకరించండి..? ఇప్పటికీ సినీ పరిశ్రమకు వందల కోట్లలలో ఫైనాన్స్ చేస్తున్నది “ప్రొద్దుటూరు మరియు ధర్మవరం” ఇవి రెండు కడప జిల్లా, అనంతపురం జిల్లాలో వున్నాయి. ఇక దేశం మొత్తం మీద ముంబాయి నుండి బంగారు 75% కొనుగోలు చేస్తున్నది ప్రొద్దుటూర్ బంగారు వ్యాపారస్థులే. ఇక తిరుమలలో ప్రతి సంవత్సరం హుండీ నుండి వచ్చిన బంగారాన్ని వేస్తున్న వేలంలో 80% శాతం కొనుగోలు చేస్తున్నది ప్రొద్దుటూర్ బంగారు వ్యాపారస్థులే. కావాలంటే ఇప్పటికీ “ఈనాడు” దిన పత్రికలో బంగారు ధరలు గురించి ఇస్తున్న సమాచారంలో.. ముంబాయి, హైదరాబాద్, చెన్నై లతో పాటు ప్రొద్దుటూర్ యెక్క బులియన్ సమాచారం కూడ ఇస్తున్నారు. వెళ్లి ఒక సారి చూడండి.

      ఇక సిమెంట్ ఫ్యాక్టరీలు, ఆయిల్ మిల్స్, కాటన్ మిల్స్ వీటన్నటీకీ రాయలసీమ చాలా చాలా ఫేమస్. అవగాహనా రాహిత్యంతో ఊరికే అవాకులు చెవాకులు పేలకండి.

      విజయవాడలో లాగ ఇక్కడ రౌడీలు లేరు. దౌర్జన్యాలుండవు. రౌడీ మామూళ్లు వుండవు సామాన్య జనాల నుండి. మరొకటి. సర్కారు జిల్లాలు, కోస్తా జిల్లాలు. కృష్ణా జిల్లాలలో లాగ “కులాల” వారిగా విడిపోయి జీవించడాలు రాయలసీమలో ఎక్కడా కనపడవు. కులాల వారిగా గొడవలు, హత్యలు ఇప్పటి వరకు అక్కడి ప్రాంతంలో జరగలేదు.

      ఇక స్టూడెంట్స్ అయ్య వార్లకు నమస్కారాలు పెట్టరా..? మీరెప్పుడైనా చూసారా..? తెలీకుండ మాట్లాడకండి. ఎవరైనా సరే తమ ధైనిందిత జీవితంలొ తమ పై అధికారులు గానీ..లేక సహొద్యోగులు కానీ.. లేక ఉపధ్యాయులు గాని ఎదురైతె ఖచ్చితంగా నమస్కారాలతో పలకరిస్తారు. ఎవరినీ చేయాలా అభివృద్ది..? పక్షపాతంతో వ్యహరించకుండా పాలకు పరిపాలన సాగిస్తే.. ఆటోమ్యాటిగ్గా అభివృద్ది జరుగుతుంది. అంతే కాని ఒకరొచ్చు చేయడమేంటి..?

      మీకు బహిరంగ సవాల్ విసురుతున్నాను మీరు చెబుతున్న వాటిలో ఏ ఒక్కటైనా నిజమని నిరూపిస్తే.. ఇక అభివృద్ది గురించి దేబరించడమే మానేస్తారు నాలాంటి వ్యక్తులు.

  2. Kadapa dati state motham okate ani chudadam start cheyandi….doctor ni kalasi tablets roju vesukunte jabbu chinnaga nayam avuthundi. Worst palakulani bumper majority la tho gelipinchi state meedaki vadali…meetho patu state ni nasanam chesindi chaalu.

  3. మన రాయలసీమ మీద మన ఆంధ్రా సోదరులకి ఎంత మంచి అభిప్రాయాలు ఉన్నాయండి.
    పై వ్యాఖ్యలు చదివి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి లో ఉన్న మన రాయలసీమ ప్రజలను తలుచుకుంటే జాలికలుగుతుంది.
    ఆంధ్రాలో అవినీతిపరులే లేకుంటే, రాయలసీమ అంత శాంతియుతమైనది కాకుంటే పోలీస్ కమీషనరేట్ ను, హైకోర్టును రాయలసీమ లోనే
    ఏర్పాటు చేయమనండి. సోదరులమంటుూ, దాయాదులుగా చూడకండి అన్నా!

  4. అయ్యా రాజా గారు రాయలసీమ నాయకులు అంత వరస్ట్ పాలకులైతే చంద్రబాబు గారిని మఖ్యమంత్రి గా ఎందుకు అంగీకరించారండి.
    మీ ప్రాంతానికి అనుకూలంగా ఉంటేనే మంచి పాలకులా? ఆంధ్రాలో గెరిచిన నాయకులలో నేర చరిత్ర గల వారే లేరా ? అయ్య మఱ్ఱిపూడి మహోజస్ గారు బెజవాడ లో స్టూడెంట్స్ అందరూ అయ్యవార్లు కనబడుతూనే నమస్కారం పెడుతున్నారా ? మరి వార్తా పత్రికలలో బెజవాడ రౌడియిజం గురించి వచ్చే వర్తలన్నీ కల్పితాలేనా ? మరి సమైఖ్యాంధ్ర ఉద్యమాల సమయంలో ఈ మటలు ఎందుకు రాలేదండి. అప్పుడు ఈ రౌడీలను గుర్తించలేక పోయారా ?
    https://facebook.com/jrs241111

  5. రాయలసీమవాళ్ళని నేనేమీ అనలేదండి బాబూ! మీరెందుకలా ఊరికే ఫీలవుతారు? కొన్ని విషయాలలో రాయలసీమ మెరుగుపడాల్సి ఉందంటున్నానంతే. తెలంగాణవాళ్ళ మాదిరి ప్రతీదానికీ పక్కప్రాంతాన్నో, ప్రభుత్వాన్నో ఆడిపోసుకోవడం సరికాదంటున్నాను. కోస్తావారిని ఇంత నిందిస్తారు గదా, మరి మీవాళ్ళంతా తమ డబ్బు తీసుకెళ్లి చెన్నైలోనో, బెంగుళూరులోనో ఎందుకు పెడుతున్నారో, రాయలసీమలో ఎందుకు పెట్టుబడి పెట్టరో ఎప్పుడైనా నిలదీశారా? మీవాళ్ళు మీకు చెయ్యనిది మావాళ్ళు చెయ్యాలని ఎందుకు ఆశిస్తున్నారు? ఆశించి ఎందుకు వృథాకోపం పెంచుకుంటున్నారు?

    ఇహపోతే రౌడీలకి ఓ ప్రాంతమంటూ ఏమీ ఉండదు. మా జిల్లాలలో కూడా రౌడీలున్నారు. ఎటొచ్చీ వాళ్లు రౌడీలు మాత్రమే. వాళ్ళని కోస్తా సమాజం అనుసరించదు.

    పేర్లు చెప్పను గానీ రాయలసీమలోని టాప్ నాయకులు మాకు ఆమోదయోగ్యులే. వాళ్ళలాంటివాళ్ళు మాలో లేరు గనక మాకు వాళ్లే శరణ్యం. కడపని నాయుడు పట్టించుకోవడం లేదంటే ఒప్పుకుంటాను గానీ కేవలం అది వంకగా చేసుకుని యావత్తు రాయలసీమకీ ఏదో అయిపోతోందని గగ్గోలు పెట్టడం బాలేదు. చిత్తూరుజిల్లా రాయలసీమే కాదన్నట్లు ధ్వనిస్తూ కూడా ఈ సైట్ లో వ్యాసాలు రావడం చూశాను. ఆ వాదన కూడా బాలేదు. ఈ మధ్యకాలంలో- అంటే నవ్యాంధ్ర ఏర్పడ్డాక రాయలసీమకి వచ్చినన్ని సెంట్రల్ ఇన్ స్టిట్యూట్స్ గత 60 ఏళ్లల్లో ఎప్పుడూ రాలేదు. కోస్తాలో అంతర్జాతీయ విమానాశ్రయం ఈనాటికీ లేదు. కానీ రాయలసీమలో తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం కొద్దినెలల్లో రెడీ అయిపోతోంది. ఇలా చెప్పాలంటే చాలా ఉంది. అవన్నీ చెబుతూ పోతే నా ఈ వ్యాఖ్య కూడా ఓ వ్యాసంగా పరిణమించే ప్రమాదం ఉంది. కనుక ఇంతటితో విరమిస్తున్నాను.

    ప్రతీదానికీ నీళ్ళ కేటాయింపుల్ని కొలమానంగా తీసుకుని చూడడం కూడా సరికాదు. ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితుల్ని బట్టి రకరకాల డెవలప్ మెంట్ మోడల్సుని అడాప్ట్ చేసుకోవాలి. కోస్తా యొక్క అభివృద్ధి నమూనా రాయలసీమకి పనిచెయ్యకపోవచ్చు. కోస్తానే అనుసరిద్దామనుకుంటే కోస్తావాళ్ళమీద అనవసరమైన ద్వేషం కలుగుతుంది. తెలంగాణవాళ్ళ విషయంలో జరిగినది అదే. మీకు తగ్గ డెవలప్ మెంట్ మోడల్ మీరు రూపొందించుకోండి. కోస్తాని అనుసరించవద్దు. అది మీ ప్రాంతానికి సూట్ కాదు. మీ ప్రాంతానికి వరి అన్నం కూడా సూట్ కాదు. అది అనవసరంగా అలవాటు చేసింది ఒకప్పటి ఎన్టీయార్ ప్రభుత్వం.

    • మహోజస్ గారూ,
      “రాయలసీమ సమాజం శాంతియుతమైనది కాదు, ఇది వాస్తవం.” అంటున్నారు. మీరు అలా అనుకోవడానికి కారణాలేమిటి? ఇదే వెబ్సైటులో జిల్లాలవారీగా నేరగణాంకాలు ఉన్నాయి (పారిశ్రామికవేత్తలను భయపెడుతున్నది ఎవరు?, వివిధ రకాలైన నేరాల సంఖ్య ఎక్కడ ఎక్కువ?). వాటికి మీ సమాధానమేమిటి? “కోస్తా జిల్లాల్లో కూడా రౌడీలున్నారు కానీ వాళ్ళని కోస్తా సమాజం అనుసరించదు” అంటున్నారు. అంటే రాయలసీమ సమాజం మొత్తం నేరగాళ్ళ మయం అంటున్నారా?

    • అయ్యా మహోజన్ గారు.

      ప్రతి దానికి తెలంగాణ వారితో రాయలసీమ ప్రజలు ఎక్కడ పోల్చుకొంటున్నారండి.? వారు అభ్యర్థిస్తున్నారు..మిగతా ప్రాంతాలపాటు ఎటువంటి వివక్షత లేకుండా.. రాయలసీమలోని అన్ని జిల్లాలను అభివృద్ది పరచండి అని.

      పక్క ప్రాంతాన్ని ఆడిపోసుకోవడమా..? ఎక్కడ ఆడిపోసుకొంటున్నారు. పాలకుల యెక్క పక్షపాత దోరణని మాత్రమే ప్రశ్నిస్తున్నారు. అది గమనించండి మీరు.

      ఒక్క రాయలసీమ వారేనా ప్రక్క రాష్ట్రాలకెళ్లి వ్యాపారాలు చేస్తున్నది. మరే ప్రాంతం వారు చేయట్లేదా..? మీ వాళ్లు రాయలసీమకు చేయమని ఎవరు దేబరిస్తున్నారు ఇక్కడ..? ప్రభుత్వ పరమైన అభివృద్ది అంతా ఒకే ప్రాంతానికి పరిమితం చేయకండి అని ప్రార్థిస్తున్నారు. అంతే కాని మీ ఆస్థులన్నీ తెచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టమని ఎవరు దేబరించట్లేదు. ముందు మీరు విషయాన్ని బాగా అవగాహన చేసుకొని వ్యాక్యానించండి.

      రౌడీలను అక్కడి సమాజం అనుసరించనట్లే.. రాయలసీమ సమాజం కూడ ముఠానాయుకలను అనుసరించదు. ఎవరి జీవితం వారిది ఎక్కడైనా కానీ.

      అన్నిటికీ “తిరుపతి” ఒక్కటే పరిష్కారమన్నట్లుగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు కాబట్టే చిత్తూరు జిల్లాను ప్రస్తావిస్తున్నారు. అది గమనించండి మీరు. తిరుపతి ఒక ఆధ్యాత్మిక కేంద్రం.. దానిని అలానే ప్రశాంతంగా వుంచితే భక్తులకు, యాత్రికలకు మనశ్శాంతిని కలిగించిన వారవుతారు.

      అయ్యా కోస్తా, సర్కారు ప్రాంతంలా రాయలసీమ నైసర్గిక స్వరూపం లేదు. వుండదు కూడ. అలానే భౌగోళిక పరంగా కొన్ని పరిమితిలు, పరుధులు వున్నాయి. వాటిని అనుసరించే నీటి కేటాయింపులు. నదులు నిర్మాణం జరగాలి. సర్ ఆర్థర్ కాటన్ దొర గోదావరి పరివాహకంతో పాటుగా రాయలసీమ కరువు జిల్లాలకు ( అప్పట్లో ములికి నాడు సీమ అనే పేరు వున్నది, నిజాం ప్రభువులు కేవలం మరాఠా రాజుల యుద్దాల నుండి కాపాడుకొవడానికి ఆయుధాల కోసం ఆంగ్లేయులకు ములికి నాడు సీమను అమ్మేసారు. దాంతో దత్త మండలాలు అనే పేరుతో పిలుబడుతున్నది ) మరొక నది నిర్మాణంకోసం పరిశొధనలు చేసి నిర్మాణం కోసం తయారు చేసారు. అంతలోనే స్వాతంత్ర్యం రావడం.. ఆ ప్రణాళికను కోస్తా నాయుకలు బుట్టదాకలు చేయడం సరిపోయింది. దానినే దుమ్ము దులిపి యన్టియార్ గారు తెలుగు గంగ పేరుతో నిర్మాణం చేపట్టారు. అప్పట్లోనే ఆ నధి నిర్మాణం సాగుంటే.. రాయలసీమ ప్రాంతం ఇప్పటికి కరువు ప్రాంతంగా మిగిలిండేది కాదు.

      శ్రీభాగ్ ఒడంబిక గురించి వెళ్లి మీరు కొద్దిగా అవగాహన పెంచుకొని వచ్చి అప్పుడు మాట్లాడండి.

      ఏంటి… “<>”________________ అని ఎవరు చెప్పారు మీకు..? వరి అన్నం సూటు కాదు. ఏ పరిశొధనల ఆదారంగా చెబుతున్నారో చెప్పగలరా..? వరి అన్నం యన్టియార్ అలవాటు చేసారా..? ఏమ్ చదువుకొన్నారు మీరు..? ప్రాంతాల గురించి కనీసపు అవగాహనైనా మీకున్నదా అని ఇప్పుడు అనుమానం వేస్తున్నది. అవగాహన రాహిత్యంతో వ్యాక్యలు చేయడం వలన మీ పరువే పోగొట్టుకొంటున్నారు.

      అయ్యా సారూ. యన్టియార్ రాక మునుపే కొన్ని ఏళ్ల నుండి రాయలసీమ ప్రాంతంలో వరి సాగు సాగుతున్నది. అక్కడ “నెల్లూరి బియం” చాలా చాలా ఫేమస్. పోనీ బరిగలు పేరు విన్నారా మీరు. వాతావరణ అనుకూలతను బట్టి ఆయా కాలాలలో అక్కడి తిండి వుంటుంది. అది తెలుసుకోండి మీరు మొదట. అసలు యన్టియార్ గారికి వరి అన్నానికి సంబందం ఏంటి..? అనవసరంగా ఇలాంటి విషయాలలొకి యన్.టి.ఆర్ గారి పేరును లాగి ఆయనను అవమానస పరుస్తున్నారు మీలాంటి అవగాహన రాహిత్యం వున్న వాళ్లు. వెళ్లి చరిత్రను మీ పెద్దల నుండి కాకుండా కాస్త లైబ్రరీలకెళ్లి పుస్తకాలను చదవండి.

  6. Ayya Suresh garu…Nenu Rayalaseema ni eppudu annanu ayya???? Rayalaseema ante Kadapa okkatena????

    Naa coment lo leni rayalaseema padanni naaku antagattalani chudatam lo ne undi nee visham challe budhi…Jathi ni vishinam chese shaktulu.

    Nenu worst palakulani gelpinchindi chalu anna (kadapa..pulivendula) kadapa leaders motham bad anala…moreover I never said anything about Rayalaseema in my comment.

    Anni districts meeku entha daggaro maaku antha daggara…..kadapa info ani oka site petti migatha state motham meeda visham challadam deniki?? more over I am not saying anything about kadapa people (I am talking only about this kadapa info people)…..visham challadamthappa emi ledu

    6 Years mee cm unnadu ga..mee district bagane develop ayyi andale aa 6 years lo…. (IIIT in idupalapaya…ring road to pulivendula….brahmini steels vigara vigara)

    ledu avva ledu anta ra..mari ayyana meeda padi edavandi.

    Evado facebook lo ichina link ki state lo unna valla andariki emi sambahandam….nuvvu ala anukunte chala…???

    Prati roju…prathi news ni pattukoni visham challakunda…5 years chudu…if there is no development…dont vote for that party…choice is in your hands…. Mee local MLA ni…MP ni neeladiyi nee demands gurunchi…. vallani emi anakunda Andra…rayalaseems ani visham kakkadam enduku???

    Projects to Rayalaseema in last 10 months:
    ————————————————————
    HERO HONDA
    15+ projects in SriCity
    IIT, IISER, IIT in Tirupati
    Tirupati Airport renovation in Garuda style
    NACEN Hindupur
    Indian Culinary Institute
    4 Lane roads from Kurnool & Kadapa to Vijayawada
    5000 MW solar unit in Anantapur
    2500 MW solar unit in Kurnool

    Tomorrow state govt is signing 46 MoUs and majority are coming to Rayalaseema (27 in 4 districts)

    Mee badha Rayalaseema gurincha or only kadapa gurincha?????

    If you can…do some good to society or just do your work…Dont try to devide state just for your Kick.

    • Raj గారూ,
      నేను ఒక అభిప్రాయాన్ని వెల్లడించే ముందు దానికి సంబంధించిన వాస్తవాలేమిటి? అని చూస్తాను. అధికారికంగా నిర్ధారించబడిన వాస్తవాలనే పేర్కొంటాను. మీకు చేతనైతే ఆ వాస్తవాలను తప్పని రుజువు చెయ్యండి. అది చేతగాక “విషం చల్లడం” అని కాని మాటలెందుకు? మిగతా జిల్లాలతో పోల్చినప్పుడు మా మాతృభూమి అన్ని రంగాల్లో వెనకబడిందని గమనించండి, మా ప్రాంతాన్ని “కూడా” అభివృద్ధి చెయ్యండి అని ఆక్రోశిస్తూంటే అది మిగతా రాష్ట్రం మీద విషం చల్లడమా? వేర్పాటువాదమా? భేష్! మీరు చాలా బాగా అర్థం చేసుకున్నారు. మీరంటున్న “ఆంధ్రా-రాయలసీమ” ప్రస్తావన మొదట తీసుకొచ్చింది కూడా కోస్తా సోదరుడే. రాయలసీమ నా అజెండా కానే కాదు. నేను పాలకులను కోరేదల్లా ఒక్కటే. “అన్ని రంగాల్లో అట్టడుగున ఉన్న కడప, శ్రీకాకుళం, విజయనగరం లాంటి జిల్లాలను అభివృద్ధి చెయ్యండి. ప్రాంతాల పేరుతో రాయలసీమ/కోస్తా అంతటినీ ఒకేగాటన కట్టి మీ బాధ్యతనుంచి తప్పించుకోకండి.” ఇది విషం చల్లడం ఎలా ఔతుందో మీరే చెప్పండి.

  7. కోస్తా వాళ్లకు మనోల్ల చైతన్యం చూసి పిచ్చి పీక్ దాకా వెళ్ళింది. వాళ్ళ అరికాళ్ళ కింద మంటలు మొదలయ్యాయి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: