బచావత్ ట్రిబ్యునల్

రాయలసీమ సాగునీటి కేటాయింపులు (బచావత్ అవార్డు)

కృష్ణా జలాల పంపకంపై మూడు పరీవాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ల మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించి, లభ్యమయ్యే నీటిని పంపకం చేసేందుకు 1969 ఏప్రిల్ 10 న కేంద్ర ప్రభుత్వం బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. జస్టిస్ ఆర్.ఎస్.బచావత్ అధ్యక్షుడిగా ఈ  ట్రిబ్యునల్ అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956 కు లోబడి ఏర్పాటయింది.

కృష్ణా నదిలో నమ్మకంగా ప్రవహిస్తుందని అంచనా వేసిన 2060 టి.ఎం.సి. నికర జలాలను 1976 లో ట్రిబ్యునల్ కింది విధంగా సాగునీటి కేటాయింపులు చేసింది. మహారాష్ట్ర: 560 టి.ఎం.సి, కర్ణాటక: 700 టి.ఎం.సి, ఆంధ్రప్రదేశ్: 800 టి.ఎం.సి.

పై నీటికి అదనంగా నదిలో 70 టి.ఎం.సి. ఊట (రీజనరేటివ్ ఫ్లో) ఉంటుందని కూడా అంచనా వేసారు. ఈ నీటిని కూడా పంచాక మూడు రాష్ట్రాల వాటా ఇలా ఉంది. మహారాష్ట్ర: 585 టి.ఎం.సి, కర్ణాటక: 734 టి.ఎం.సి, ఆంధ్ర ప్రదేశ్: 811 టి.ఎం.సి

చదవండి :  శ్రీశైలం నీటిమట్టం నిర్వహణకు ఉద్దేశించిన జీవో 107

పై మొత్తాలకు మించి ప్రవహించే అదనపు జలాలను పూర్తిగా వాడుకునే స్వేచ్ఛను ఆంధ్ర ప్రదేశ్ కు ఇచ్చింది. అయితే ఈ అధిక జలాలపై హక్కును మాత్రం ఆంధ్ర ప్రదేశ్ పొందదు.

బచావత్ ట్రిబ్యునల్ రాయలసీమ సాగునీటి పథకాలకు చేసిన నికర జలాల కేటాయింపులు క్రింది విధంగా ఉన్నాయి:

కడప – కర్నూలు కాలువ : 39.9  టిఎంసిలు (ఇందులో 10 టిఎంసిలు తుంగభద్ర జలాశయం నుండి, మిగతా 29.9టిఎంసిలు నదీ ప్రవాహం నుండి సుంకేసుల ఆనకట్ట ద్వారా తీసుకోవాలి)

తుంగభద్ర కుడిగట్టు లోలెవెల్ కాలువ : 29.50 టిఎంసిలు (ఇందులో ఆవిరి నష్టం : 5.50 టిఎంసిలు)

తుంగభద్ర కుడిగట్టు హైలెవెల్ కాలువ : 32.50 టిఎంసిలు

భైరవాని తిప్ప (వేదవతి నదిపై నిర్మించబడిన చిన్న జలాశయం, అనంతపురం జిల్లా, నిల్వ సామర్థ్యం 2.5 టిఎంసిలు) : 4.90  టిఎంసిలు (ఇందులో ఆవిరి నష్టం : 0.80 టిఎంసిలు)

చదవండి :  కెసి కెనాల్ ప్రవాహ మార్గం

గాజులదిన్నె జలాశయం (హంద్రీ నది (తుంగభద్రకు ఉపనది)పై నిర్మితమైన జలాశయం, కర్నూలు జిల్లా, నిల్వ సామర్థ్యం: 1.25 టిఎంసిలు)  : 2.00 టిఎంసిలు (ఇందులో ఆవిరి నష్టం : 0.20 టిఎంసిలు)

చిన్న నీటి పారుదలకు : 13.90 టిఎంసిలు (K-8 తుంగభద్ర పరీవాహక ప్రాంతం : 6.46  టిఎంసిలు, K-9 వేదవతి (తుంగభద్ర ఉపనది) పరీవాహక ప్రాంతం: 7.57  టిఎంసిలు)

శ్రీశైలం కుడిగట్టు కాలువ: 19 టిఎంసిలు

శ్రీశైలం జలాశయం ఆవిరి నష్టాలు (మూడు ప్రాంతాలకూ కలిపి) : 33  టిఎంసిలు (ఇందులో రాయలసీమ వాటాను 11 టిఎంసిలుగా ఆం.ప్ర ప్రభుత్వం నిర్ణయించింది).

గమనించవలసిన విషయాలు:

శ్రీశైలం జలాశయంలో పేర్కొన్న ఆవిరి నష్టాలను దామాషా పద్ధతిలో కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రాంతాలకు సమానంగా పంచింది. దీంతో తక్కువ నీటి కేటాయింపులు కలిగిన రాయలసీమ ప్రాంతం అధికంగా నష్టపోయింది.

ఆం.ప్ర వాటాగా మద్రాసు తాగునీటి కోసం ఇచ్చిన 5 టిఎంసిలకు గాను మన రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ చిన్న నీటి పారుదలకు కేటాయించిన 13.90 టిఎంసిల నుండి 1.66 టిఎంసిల కోత పెట్టింది. ఇక్కడ దామాషా పద్ధతిలో కాకుండా కోస్తా (ట్రిబ్యునల్ కేటాయింపులు: 11.5 టిఎంసి), రాయలసీమ, తెలంగాణా (ట్రిబ్యునల్ కేటాయింపులు: 90.84 టిఎంసిలు) ప్రాంతాల చిన్న నీటి పారుదల కేటాయింపుల నుండి సమానంగా కోత విధించారు.

చదవండి :  చుక్క నీరైనా ఇవ్వని సాగర్ కోసం ఉద్యమించేట్టు చేశారు

అలాగే కెసికెనాల్ ఆధునీకరణ ద్వారా, తిరుగు ప్రవాహాల ద్వారా ఆదా అయిన 19 టిఎంసిల నికరజలాలను శ్రీశైలం కుడిగట్టు కాలువ (గాలేరు – నగరి)కి కేంద్ర జలసంఘం అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

తుంగభద్ర జలాశయంలో కెసికెనాల్ వాటాగా ఉన్న 10 టిఎంసిల నీటిని వైఎస్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో అనంతపురం జిల్లా దాహార్తిని తీర్చేందుకు కేటాయిస్తూ ఉత్తర్వు వెలువరించింది. ఇందుకు ప్రతిగా పోతిరెడ్డిపాడు ద్వారా కెసికెనాల్ కు 10 టిఎంల నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది.

ఇదీ చదవండి!

Gandikota

గాలేరు నగరి సుజల స్రవంతి

పథకం పేరు : శ్రీ కృష్ణదేవరాయ గాలేరు నగరి సుజల స్రవంతి సాగునీటి పథకము (ఆం.ప్ర ప్రభుత్వం 2 జులై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: