రామభద్ర రఘువీర … అన్నమయ్య సంకీర్తన

    రామభద్ర రఘువీర … అన్నమయ్య సంకీర్తన

    సంకీర్తన:296


    ‘రామభద్ర రఘువీర’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి…

    రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ
    నామమే కామధేనువు నమో నమో॥పల్లవి

    కౌసల్యానందవర్ధన ఘనదశరథసుత
    భాసుర యజ్ఞరక్షక భరతాగ్రజ
    రాసికెక్క కోదండ రచన విద్యా గురువ
    వాసితో సురలు నిను వడి మెచ్చేరయ్యా॥రామభద్ర

    మారీచసుబాహు మర్దన తాటకాంతక
    దారుణవీరశేఖర ధర్మపాలక
    కారుణ్య రత్నాకర కాకాసుర వరద
    సారెకు వేదవిదులు జయవెట్టేరయ్యా ॥రామభద్ర

    చదవండి :  అన్నమాచార్యుని గురించి ఆయన మనవడు రాసిన సంకీర్తన

    సీతారమణ రాజశేఖర శిరోమణి
    భూతలపుటయోధ్యాపుర నిలయా
    యీతల శ్రీవేంకటాద్రి నిరవయిన రాఘవా
    ఘాత నీ ప్రతాపమెల్ల కడునిండెనయ్యా ॥రామభద్ర


    ‘రామభద్ర రఘువీర’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి…

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *