
19న పి రామకృష్ణ సాహితీసర్వస్వం పుస్తకావిష్కరణ
తులసీకృష్ణ, తులసి, పి రామకృష్ణ పేర్లతో సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించిన కడప జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత రామకృష్ణారెడ్డి పోసా గారి రచనలను అన్నిటినీ ఏర్చీ కూర్చీ వారి కుమారుడు సురేంద్ర (ప్రఖ్యాత కార్టూనిస్టు) ఒకే పుస్తకంగా తీసుకు వస్తున్నారు. ‘పి రామకృష్ణ రచనలు’ పేర వెలువడిన రెడ్డి గారి సాహితీ సర్వస్వం ఆవిష్కరణకు సిద్ధమైంది. 820 పుటలున్న ఈ పుస్తకంలో రామకృష్ణ గారి కథలు, కవితలు, నవలలు, వ్యాసాలు (కాలమ్స్ సహా) అన్నీ ఉన్నాయి. అన్వర్ గీసిన ముఖ చిత్రం ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ.
త్వరలో కడప నగరంలో జరగనున్న పుస్తకావిష్కరణ సభలో పలువురు సాహితీవేత్తలు పాల్గొంటున్నారు.
పుస్తకావిష్కరణ సభ వివరాలు:
తేదీ : జులై 19, ఆదివారం
సమయం: ఉదయం 9 గంటల 30 నిముషాల నుండి
వేదిక : సిపి బ్రౌన్ గ్రంధాలయం, ఎర్రముక్కపల్లి, కడప
సభాధ్యక్షులు : డాక్టర్ మల్లెమాల వేణుగోపాలరెడ్డి
ప్రసంగాలు : సింగమనేని నారాయణ, డా.పి సంజీవమ్మ, ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి, సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి, పాలగిరి విశ్వప్రసాద్
ప్రవేశం : అందరికీ (ఎవరైనా రావచ్చు)
సభ నిర్వహణ: నూకా రాంప్రసాద్ రెడ్డి (పెన్నేటి పబ్లికేషన్స్)