
‘సతీష్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాల’
జిల్లాపై వివక్ష కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి
కడప : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాపై వివక్ష కొనసాగిస్తున్నాడని , ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని ఇతర జిల్లాకు తరలించడమే ఇందుకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నజీర్అహ్మద్ ఆరోపించారు.
స్థానిక ఇందిరాభవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కడప జిల్లాలో ఉర్దూ యూనివర్సిటీ, ఒంటిమిట్ట ఉత్సవాలు, పెద్దదర్గా అభివృద్ధి, ఫుడ్‌పార్క్ మొదలైన వాటిపై శాసనసభలో ప్రకటన చేశారని.. ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని విమర్శించారు.
ఉర్దూ యూనివర్సిటీ సాధన సమితి 25 రోజులు నిరాహారదీక్షలు చేపడితే శాసనమండలి ఉపాధ్యక్షుడు సతీష్‌రెడ్డి ముస్లిం మైనార్టీలకు స్పష్టమైన హామీ ఇచ్చి దీక్షలను విరమింపజేశారన్నారు.
ఉర్దూ విశ్వవిద్యాలయ సాధన సమితి గురువారం ముఖ్యమంత్రిని కలిస్తే ఆ మాటే వద్దని.. మరేదైనా కోరమన్నాడంటే సభలో ఆయన చెప్పిన మాటలకు విలువలేదా అని ప్రశ్నించారు.
మైనార్టీలను మభ్యపెట్టి దీక్షలను విరమింపజేసి మాట నిలబెట్టుకోలేకపోయిన సతీష్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.