suharlata

రాజంపేట మండలాధ్యక్షురాలిపై అనర్హత వేటు

రాజంపేట: విప్‌ను ధిక్కరించి తెదేపాకు ఫిరాయించిన రాజంపేట మండలపరిషత్తు అధ్యక్షురాలు సుహర్లతపై అనర్హత వేటు పడింది. ఈమె ఏప్రిల్‌లో జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో మండలంలోని వూటుకూరు-2 ఎంపీటీసీ స్థానం నుంచి వైకాపా తరుపున పోటీచేసి గెలుపొందారు. ఎంపీపీ ఎన్నిక సమయంలో తెదేపా ప్రలోభాలకు లొంగి ఈమె వైకాపా నుండి ఫిరాయించి లాటరీ పద్ధతిలో తెదేపా తరపున ఎంపీపీగా ఎన్నికయ్యారు.

పార్టీ విప్‌ను ఉల్లంఘించడం వల్ల వైకాపా నాయకులు ఎన్నికల కమిషన్‌కు, ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. దీంతో అధికారులు విచారణ చేపట్టారు. సోమవారం రాజంపేట ఎన్నికల అధికారి సత్యనారాయణ వూటుకూరు-2 ఎంపీటీసీ స్థానం నుంచి గెలుపొందిన సుహర్లత సభ్యత్వాన్ని రద్దుచేస్తూ రాజంపేట ఎంపీడీవో వెంకటసుబ్బయ్యకు ఉత్తర్వులు పంపారు. ఈ ఉత్తర్వులను ఎంపీడీవో ఎంపీపీ నాదెర్ల సుహర్లతకు అందజేశారు. దీంతో ఈమె ఎంపీటీసీ సభ్యత్వం రద్దయ్యింది.

చదవండి :  ప్రొద్దుటూరు శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

ఎంపీపీ పదవిపై కూడా అనర్హత వేటు పడింది. సాధారణంగా ఎంపీపీపై అనర్హత వేటు పడితే ఉపాధ్యక్షులు అధ్యక్షులుగా కొనసాగుతారు. రాజంపేట మండల ఉపాధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి సోదరుడు ఆకేపాటి రంగారెడ్డి ఎన్నికయ్యారు. ఈయన ఇప్పుడు ఎంపీపీగా కొనసాగే అవకాశం ఉంది.

ఇదీ చదవండి!

క్షమాపణ

మా పిల్లోల్లకు 48 గంటల్లో క్షమాపణ చెప్పాల

చలసాని, శివాజీలకు బైరెడ్డి హెచ్చరిక అనంతపురం: మేధావిగా చెప్పుకునే చలసాని, సినీనటుడు శివాజి రాయలసీమ పిల్లోల్లపై జరిగిన దాడులపై 48 …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: