రాచపాలెం చంద్రశేఖరరెడ్డికి కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు

ప్రముఖ సాహితీ విమర్శకులు, సాహితీవేత్త ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు ఈ ఏడాది కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన రచించిన “మన నవలలు, మన కథలు” అనే విమర్శనా గ్రంథానికి ఈ అవార్డు ఇస్తున్నట్లు శుక్రవారం కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రకటించింది.

మన నవలలు మన కథానికలురాచపాళెం చంద్రశేఖర రెడ్డి ప్రస్తుతం కడపలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధనాకేంద్రం భాద్యులుగా వ్యవహరిస్తూ ఇక్కడి యోగివేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో గౌరవ అధ్యాపకులుగా పనిచేస్తున్నారు.

చిత్తూరు జిల్లాలోని కుంట్రపాకం(తిరుపతి సమీప గ్రామం)లో జన్మించిన రాచపాళెం గతంలో అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షుడిగా పనిచేసి పదవీవిరమణ పొందినారు.

చదవండి :  'తానా' కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా మనోడు

వీరు రాయలసీమ సాహిత్యోద్యమాల చరిత్ర, దళిత కథలు, ఆధునికాంధ్ర కవిత్వం, గురజాడ కథానికలు వంటి రచలను ఆయన వెలువరించారు. చంద్రశేఖర్ రెడ్డి రాసిన సాహిత్య విమర్శనా వ్యాసాలు పలు పత్రికల్లో విరివిగా ప్రచురితమయ్యాయి. సీమనానీలు, దీపధారి గురజాడ, చర్చ, తదితర సాహితీ విమర్శా గ్రంథాలను రచించారు.

కడప జిల్లా సాహితీకారుల జీవితం-సాహిత్యం పై సి.పి.బ్రౌన్ భాషా పరిశోధనాకేంద్రంలో ‘నెలనెలా మనజిల్లా సాహిత్యం’ పేర వీరు నిర్వహిస్తున్న ప్రసంగ కార్యక్రమాలు బహుళ జనాదరణ పొందాయి. జిల్లాకు చెందిన అనేక మంది ఉద్ధండ సాహితీవెత్తలను ఈ కార్యక్రమంద్వారా వెలుగు లోకి తెచ్చారు.

చదవండి :  సీమ కోసం బడి పిల్లోళ్ళు రోడ్డెక్కినారు

కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికైన రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారిని పలువురు సాహితీ ప్రముఖులు అభినందించారు. అచార్య డాక్టర్ కేతు విశ్వనాథ రెడ్డి , రచయితలు శశిశ్రీ, తవ్వా ఓబుల్ రెడ్డి, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, కట్టా నరసింహులు, డాక్టర్ మల్లెమాల వేణుగోపాల్ రెడ్డి , మూలే మల్లికార్జున రెడ్డి, డాక్టర్ వినోదిని, డాక్టర్ తవ్వా వెంకటయ్య తదితరులు అభినందించిన వారిలో ఉన్నారు.

ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారికి

కడప జిల్లా ప్రజల తరపున www.www.kadapa.info అభినందనలు తెలియచేస్తోంది!

ఇదీ చదవండి!

అష్టదిగ్గజాలు

మట్లి (సిద్ధవటం) రాజుల అష్టదిగ్గజాలు

సిద్ధవటం రాజుల అష్టదిగ్గజాలు నా నీతిని వినని వానిని – వానను తడవని వానిని కననురా కుందవరపు కవి చౌడప్పా- …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: