గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కడప రెవెన్యూ డివిజన్‌కు చెందిన 17 మండలాల్లో 217 పంచాయతీ సర్పంచ్‌లకు, 1648 వార్డులకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగనుంది. 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
చక్రాయపేట మండలం బురుజుపల్లిలో వైసీపీ-కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు చెదరగొట్టారు.