
మైదుకూరు శాసనసభ బరిలో 12 మంది
మైదుకూరు శాసనసభ స్థానానికి గాను మొత్తం 28 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం మొత్తం 12 మంది అభ్యర్థులు తుది పోరులో నిలువనున్నారు. తుదిపోరులో నిలువనున్న 12 మంది అభ్యర్థులకు ఎన్నికల సంఘం ఇప్పటికే గుర్తులను కేటాయించింది. మైదుకూరు శాసనసభ స్థానం నుండి తలపడుతున్న అభ్యర్థుల జాబితా మరియు వారికి కేటాయించిన గుర్తులు …
1 రఘురామిరెడ్డి శెట్టిపల్లి – వైకాపా – సీలింగ్ ఫ్యాన్
2 డి ఆంజనేయులు – వైఎస్సార్ ప్రజా పార్టీ – ఆటోరిక్షా
3 ఎం జెర్మియా – బసపా – ఏనుగు
4 డి జనార్ధన్ రెడ్డి – నేకాపా – గడియారం
5 పుట్టా సుధాకర్ యాదవ్ – తెదేపా – సైకిల్
6 వెనుతుర్ల రవిశంకర్ రెడ్డి – జైసపా – చెప్పులు
7 కోటయ్యగారి మల్లిఖార్జునమూర్తి – కాంగ్రెస్ – చెయ్యి
8 చిలుంగారి చిన్న పుల్లయ్య – ఆమ్ ఆద్మీ – చీపురు
9 కె జయన్న – స్వతంత్ర అభ్యర్థి – టెలిఫోన్
10 పి బాలయ్య యాదవ్ – స్వతంత్ర అభ్యర్థి – అల్మారా
11 బొమ్ము వీరనారాయణరెడ్డి – స్వతంత్ర అభ్యర్థి – పండ్ల బుట్ట
12 ఎస్ రామప్రతాప్ రెడ్డి – స్వతంత్ర అభ్యర్థి – బ్యాట్