మహిళా డెయిరీల మూసివేతకు రంగం సిద్ధం?

కడప జిల్లాలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నడుస్తున్న పాలశీతలీకరణ కేంద్రాల(బీఎంసీయూ) మూసివేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. మహిళలను లక్షాధికారులను చేసే ఉద్దేశంతో బ్యాంకులింకేజీ, వడ్డీలేని రుణాలు తదితర కార్యక్రమాలతో పాటు బీఎంసీయూలను ఏర్పాటు చేసి మహిళలు ఆర్థికంగా పురోగతి సాధించేందుకు వీటిని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినారు.

జిల్లాలో గతంలో 32 వేల లీటర్లకు పైగా పాలను సేకరించగా ప్రస్తుతం అన్ని బీఎంసీయూలు కలిపి 6,500 లీటర్లకు మించి సేకరణ జరగడం లేదు. జిల్లాలో 21 పాలశీతలీకరణ కేంద్రాలు ఉండగా ప్రస్తుతం ఏడు మాత్రమే పాలను సేకరిస్తున్నాయి. సుండుపల్లెలో రోజూ 2,200 లీటర్లు, వేంపల్లెలో 120 లీటర్లు, బద్వేలులో 800 లీటర్లు, ఒంటిమిట్టలో 1100 లీటర్లు, కమలాపురంలో 360 లీటర్లు, తొండూరులో 250 లీటర్లు, లింగాలలో 1200 లీటర్ల చొప్పున ఏడు బీఎంసీయూలలో 6030 లీటర్లు మాత్రమే సేకరిస్తున్నారు.

చదవండి :  కడపజిల్లా పోలింగ్ విశేషాలు

ఇదే అదనుగా భావించిన ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పాల సేకరణ జరగటం లేదని చెప్పి డెయిరీల మూసివేతకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

కరువు నేపథ్యంలో పశుగ్రాస కొరత ఏర్పడటం, దీనిని నివారించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టకపోవడంతో జిల్లా వ్యాప్తంగా పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గినట్లు అధికారులే అంగీకరిస్తున్నారు. ఆం.ప్ర ప్రభుత్వ డెయిరీ చెల్లిస్తున్న ధర ప్రయివేటు డెయిరీల కన్నా తక్కువగా ఉండటం వల్ల కూడా బీఎంసీయూలు పాల సేకరణలో వెనుకబడ్డాయి.

చదవండి :  టీడీపీకి 25 ఓట్లు, వివేకాకు 10 ఓట్లు

పాలసేకరణ తగ్గటానికి వెనుక గల కారణాలను గుర్తించి వాటిని సరిదిద్దవలసిన ప్రభుత్వం పాల సేకరణ జరగటం లేదని సాకు చెప్పి వాటి మూసివేతకు పూనుకోవటం మంచిది కాదు. గతంలో తెదేపా ప్రభుత్వం ప్రొద్దుటూరు పాల కర్మాగారం మూసివేసిందన్న  అపవాదు ఇప్పటికీ మోస్తోంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: