మహనందయ్య – జానపద కళాకారుడు (చెక్కభజన)

రెండు చెక్కలను లయాత్మకంగా కొట్టడం ద్వారా అద్భుతమైన సంగీతాన్ని సృష్టించి దానికి అనుగుణంగా అడుగులు వేసే కళ చెక్కభజన. చెక్కభజనలో అడుగులకు అనుగుణంగా పాటలో వేగం, ఊపు, ఉంటాయి. చాలారకాల అడుగులున్నాయి . ఆది అడుగు, రెండు, మూడు, పర్ణశాల, కుప్పకొట్టడం, కులుకు వంటివి ప్రత్యేకమైన అడుగులు. ఈ అడుగులకు అనుగుణంగా చెక్కలు కొడుతుంటారు. గురువు మధ్యలో ఉండి పాట పాడతాడు.

మహనందయ్యజానపదులు ఆదరించిన కళారూపాల్లో చెక్కభజనకు విశేషమైన స్థానం ఉంది. చెక్కభజనను జానపదులకు దగ్గర చెయ్యడంలో అనేక మంది గురువులు తమ జీవిత పర్యంతం విశేషమైన కృషి చేశారు. అటువంటి వారిలో మానందయ్య ఒకరు. 1970లో అయిన చిలంకూరి సుబ్బారెడ్డి వద్ద శిష్యరికం చేసి గజ్జె కట్టి పలకల భజనలో మెలకువలను నేర్చుకున్న వీరు తరువాత తనే గురువుగా మారి కడప జిల్లా వ్యాప్తంగా వందలాది బృందాలకు చెక్కభజన నేర్పించారు.

1990వ దశకంలో జిల్లావ్యాప్తంగా ఎక్కడ ఒక మోస్తరు తిరుణాల జరిగినా, అక్కడ మానందయ్య తను శిక్షణ ఇస్తున్న భజన బృందంతో ప్రత్యక్షమయ్యి ఉర్రూతలూగించారు. కడప జిల్లాలోనే కాకుండా కర్నూలు, ఒంగోలు, చిత్తూరు, అనంతపురం తదితర ప్రాంతాల్లో తన శిష్యబృందాలతో ప్రదర్శనలిచ్చి మన్ననలు పొందారు. మానందయ్య గజ్జెకట్టి ఆడడంలో కాకుండా పాడడంలో కూడా నేర్పరి.  మానందయ్య తన బృందంతో కాళ్లకు గజ్జకట్టి ఆడి పాడితే జనాలు ఆ కులుకు భజన చూడడానికి ఎగబడుతారు. ఎక్కడ ఆడీ పాడినా జనాన్ని తన చుట్టూ నిలుపుకునే ఆకర్షణ మానందయ్య సొంతం.

చదవండి :  రేపటి నుంచి మల్లూరమ్మ జాతర

మహానందయ్యమహనందయ్య పాడిన ‘పోదాం రావే లక్ష్మీ, గాజులోచ్చినాయి మామ, ఏంపిల్లా, శ్రీరామ, గాజులశెట్టి, వస్తావాపిల్ల’ చెక్కభజన వంటి ఆడియో క్యాసెట్లు ప్రజాదరణ పొందాయి.

సొంతూరు చాపాడు మండలం వెదురూరు అయినా మహానందయ్య స్థిరపడింది మాత్రం ప్రొద్దుటూరు మండలం శీతంపల్లెలోనే. వయస్సు మీదపడడంతో ఆటపాటలకు దూరంగా ఉన్న మానందయ్య ప్రస్తుతం చిల్లర దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. పెద్దగా చదువుకోక పోయినా చిన్న తనం నుంచే పాటలు పాడటం అలవాటు చేసుకున్నారు. కంఠస్వరం బాగుండడంతో స్నేహితులు, పలువురి ప్రోత్సాహంతో మహనందయ్యలో పాటలు నేర్చుకోవాలనే తపన కల్గింది.

చదవండి :  ఆశలే సూపిచ్చివా - వరుణా.... జానపదగీతం

అక్షరరశ్మి సందర్భంగా కడప జిల్లా పర్యటనకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డిచే అభినందనలను అందుకున్నారు. అనేక ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను ఆయనకు అప్పగించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అనేక ప్రదర్శనలిచ్చారు. పలు పర్యాయాలు రేడియో కార్యక్రమాల్లో జానగేయాలను ఆలపించి శ్రోతలను ఆకట్టుకున్నారు. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో వందకు పైగా శిష్య బృందాలను తయారు చేసిన ఘనత మహనందయ్యకు దక్కుతుంది. తన కుమారుడిని చెక్క భజన గురువుగా తయారు చేసి ప్రదర్శనలు ఇప్పించారు. తనకు తెలిసిన కళను తనతో ఆగిపోకుండా సమాజంలో పదికాలాలపాటు వద్ధిల్లాలని శిష్యులను తయారు చేశారు.

చెక్కభజనలో జడకొప్పు, రామాయణం, మహభారతంలోని పాటలు, బ్రహ్మం గారిపాటలు, జానపద, సినీగేయాలను పాడటంలో మహనందయ్య దిట్ట. ఆయన ప్రతిభను గుర్తించిన కొందరు తగు రీతిలో సత్కరించారు.

చదవండి :  సుక్కబొట్టు పెట్టనీడు... జానపదగీతం

అందని చేయూత…

ప్రస్తుతం వయసు మీద పడటంతో శరీరం సహకరించక ప్రదర్శనలు తగ్గించారు. ప్రభుత్వం కళాకారులకు అందించే పింఛన్‌కోసం కార్యాలయాల చుట్టూ అనేక సార్లు తిరిగారు. ఆయినా ఏమాత్రం ఉపయోగం లేదని మహనందయ్య వాపోయారు.పేద కళాకారులను ఆదుకుంటే ఒక తరం కళలు మరో తరానికి అందుతాయనే వాస్తవాన్ని ప్రభుత్వాలు గుర్తించాల్సిన అవసరం ఏంతైనా ఉందని ఆయన చెబుతున్నారు. చిన్నప్పట్టినుంచి అనేక కష్ట నష్టాలను ఎదుర్కొన్నప్పటకీి ప్రస్తుతం తనకు తెలిసిన కళ మాత్రమే ఆస్థిగా మిగిలి ఉందని వాపోయారు. పని ఉంటేనే తమ ద్వారా హర్మోనిస్టు, డప్పు, సౌండ్‌ సిస్టం వంటి వారికి ఉపాధి లభిస్తుందన్నారు. ప్రస్తుతం శీతంపల్లెలో చిన్న పాటి చిల్లర దుకాణం ద్వారా కుటుంబ పోషణ సాగిస్తున్నారు. ప్రభుత్వం కళాకారుల పింఛన్‌ మంజూరు చేసి ఆదరించాలన్నారు.

(ఈ వ్యాసంలోని కొన్ని భాగాలు ప్రజాశక్తి దినపత్రిక నుండి గ్రహించబడ్డాయి.)

ఇదీ చదవండి!

కడప జిల్లాలో రామాయణ రచనా పరిమళం

కడప: తిరుమల తర్వాత అంతటి గొప్ప క్షేత్రంగా దేవుని కడపను చెప్పినట్టే.. భద్రాచలం తర్వాత ఒంటిమిట్టకు అంత ప్రశస్తి ఉందంటారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: