అసితాంగ భైరవుడి నెలవైన భైరేని లేదా భైరవకోన

భైరేని లేదా భైరవకోన కడప జిల్లాలోని ఒక ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రము. మైదుకూరు పట్టణానికి ౩౦ కిలోమీటర్ల దూరంలో నల్లమల అటవీ ప్రాంతం లో వెలసిన భైరవకోన లేదా భైరేని  భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రతి ఏట శివరాత్రి సందర్భంగా భైరవకోన తిరుణాల వైభవోపేతంగా జరుగుతుంది. ఈ భైరవకోన చరిత్ర ఇలా ఉంది .

పూర్వం అహోబిలం సమీపంలో నల్లమలలో ప్రవహించే భవనాశి నది జలప్రళయానికి సూచనగా ఉప్పొంగడం మొదలయ్యింది. దీనితో అహోబిల నరసింహ స్వామి ఈ జలప్రళయాన్ని అపవలసిందిగా అసితాంగ భైరవున్ని కోరాడట.

అసితాంగ భైరవుడు తన తలను నరికి భవనాశినదికి తర్పణం చేయడంతో జలప్రళయ గండం తప్పిందట! ఈ అసితాంగ భైరవుడే   నరసింహస్వామి ఆజ్ఞ మేరకు అహోబిలంలో మల్లేశ్వరి సమేతంగా భైరవకోనలో శిలారూపంలో వెలిశాడు.  భక్తులతో మొండి భైరవుడిగా పిలువబడుతున్నాడు.

భైరవకోన లోని భైరవుని ఆలయం
భైరవుని ఆలయం

ఈ ప్రాంత భక్తులు ఈ క్షేత్రాన్ని “భైరేని” అని పిలుస్తారు.  మహర్షుల తపోవనంగా చెప్పబడే భైరవకోనకు సంబంధించి భైరేని కొండయ్య కథ విశేష  ప్రచారంలో  ఉంది.

చదవండి :  కల్లబొల్లి రాతల రక్తచరిత్ర

భైరేని కొండయ్య కథ

పూర్వం భైరవకోనకు సమీపంలోని గంజికుంట ప్రాంతం నుండి గంగన్న అనే యాదవుడు నల్లమల అటవీ ప్రాంతంలో ఆవులనూ,మేకలను మేపుకునేందుకు ప్రతిరోజూ వెళ్ళేవాడు. భైరవకోనలో భైరవున్ని దర్శించుకునేవాడు. తనకు సంతానం కలుగక పోవడంతో సంతానం కోసం భైరవున్ని వేడుకునేవాడు.

భైరవుడు ఒక రోజు గంగన్నకు వృద్దురాలి రూపంలో ప్రత్యక్ష్యమైనాడుట. తనకు దాహం తీర్చాలని వృద్దురాలు గంగన్ననుకోరింది. పరిసర ప్రాంతాల్లో నీళ్ళు లేకపోవడంతో గంగన్న మేకపాలతో వృద్దురాలి దాహాన్ని తీర్చాడు. దీనితో సంతృప్తి చెందిన వృద్దురాలు గంగన్నకు త్యాగమూర్తి ఐన పుత్రుడు జన్మిస్తాడని దీవించి అదృశ్యమైందట. నవమాసాల తర్వాత గంగన్న భార్య బసవమ్మ మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు భైరవ కొండయ్య అని నామకరణం చేసారు.

పన్నెండేళ్ళు దాటగానే కొండయ్య అడవికి ఆవులు మేపుకురావడానికి వెళ్ళడం ప్రారంభించాడు. ఒక సారి తీవ్ర వేసవిలో అడవిలో ఎక్కడా నీళ్ళు దొరక్కపోవంతో ఆవులు దాహంతో అల్లాడుతూ అంబా అంటూ అరవబట్టినాయి. దీనితో చిన్నవయస్సులోనే భక్తీ త్రాణ పరాయణుడైన  కొండయ్య మొండి భైరవున్ని ఉద్దేశించి దీక్ష చేపట్టాడు. ఆవుల దాహార్తిని తీర్చితే తన తలను బలి ఇస్తానని మొక్కుకున్నాడు.

చదవండి :  ఉరుటూరు గ్రామ చరిత్ర

కొండయ్య తపస్సుకు మెచ్చి మొండి భైరవుడు ప్రత్యక్షమయ్యాడు. కొండచరియలో నుండి నీటి బుగ్గను సృష్టించాడు. ఈ నీటి బుగ్గతో ఆవులు దాహార్తిని తీర్చుకున్నాయి. మొండి భైరవునికి ఇచ్చిన మొక్కుబడి ప్రకారం భైరవకొండయ్య చెట్టు కొమ్మకు తన తల వెంట్రుకలను కట్టి వేలాడుతూ  తలను నరుక్కున్నాడు. చీకటి పడినప్పటికీ కొండయ్య ఇంటికి రాకపోవడంతో కొండయ్య తల్లిదండ్రులు గ్రామస్తులు కొండయ్యను వెదుక్కుంటూ అడవికి వెళ్లారు. భైరవకోనలో కొండయ్య మొండెం కిందపడి ఉండటం, తల చెట్టుకు వేలాడటం చూసారు. కొండ చరియనుండి ఉబికి వస్తున్న నీటి బుగ్గను గమనించారు.

కొండయ్య తపస్సువల్ల ఇదంతా జరిగిందని వారు గ్రహించారు. భైరవ కొండయ్య భౌతికకాయాన్ని భైరవకోనలోనే సమాధి చేసారు. కొండయ్య సమాధిని భైరవకోనలో ఇప్పుడు కూడా చూడవచ్చు. నీటిబుగ్గ నుండి ఇప్పటికీ ఎండాకాలం సైతం స్వచ్చమైన నీరు ఊరుతూ ఉంటుంది.  ఇప్పటికీ  భక్తులు దాహార్తిని తీర్చడానికీ, స్నానాలకూ ఈ  బుగ్గ నీటినే వినియోగిస్తారు.

చదవండి :  మైదుకూరు సదానందమఠం

పొలి

వేసవికాలంలో ప్రతిఆదివారం , గురువారం  భక్తులు భైరవకోనకు వెళ్ళుతూఉంటారు . ఈ ఆలయ సమీపంలోని  కొండమట్టిని సేకరించి భక్తులు అపురూపంగా  తెచ్చుకుని పొలాలకు ” పొలి ” చల్లుకుంటారు. భైరేని నుండి తెచ్చిన మట్టిని ఇళ్ళలో ఉంచుకుంటే పురుగూ,పుట్ట రావని భక్తుల విశ్వాసం .

భైరవకోన ధర్మకర్త గా లెక్కలవారిపల్లెకు చెందిన లెక్కల బాలిరెడ్డి వ్యవహరిస్తున్నారు.  ప్రభుత్వం,భైరవకోన (భైరేని) అభివృద్ధికి ఎలాంటి ప్రయత్నం చేయక పోవడంతో సరైన రహదారి కూడా లేక భక్తులు ప్రయాసకు గురవుతూనే ఈ క్షేత్రాన్ని దర్శించుకుని వస్తుంటారు.  మైదుకూరు మండలం వనిపెంట నుండి, ముదిరెడ్డిపల్లె సుగాలితండా నుండి ట్రాక్టర్లలో, జీపుల్లో భైరవకోనకు  చేరుకోవచ్చు.

లెక్కల బాలిరెడ్డి ఫోన్ నంబర్ –  +91-9676319205

తవ్వా ఓబుల్‌రెడ్డి

మొబైల్: 9440024471

ఇదీ చదవండి!

sodum govindareddy

అమెరికా జీవనమే సుఖమయమైనది కాదు – సొదుం గోవిందరెడ్డి

సాహితీకారుడు సొదుంగోవిందరెడ్డితో తవ్వా ఓబుల్ రెడ్డి జరిపిన ఇంటర్వ్యూ కడప జిల్లా ఉరుటూరు . చోళుల కాలంనాటి శాసనాలు, ఆలయాలు …

2 వ్యాఖ్యలు

  1. I needed to thanks for this excellent examine!!

  2. thanks for giving this valuble information

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: