
భక్తి కొలఁది వాఁడే పరమాత్ముఁడు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ భక్తి కొలఁది వాఁడే పరమాత్ముఁడు భుక్తి ముక్తిఁ దానే యిచ్చు భువిఁ బరమాత్ముఁడు ॥చ1॥ పట్టినవారిచే బిడ్డ పరమాత్ముఁడు బట్టబయటి ధనము పరమాత్ముఁడు పట్టుపగటి వెలుఁగు పరమాత్ముఁడు యెట్టనెదుటనే వున్నాఁడిదె పరమాత్ముఁడు ॥చ2॥ పచ్చిపాలలోని వెన్న పరమాత్ముఁడు బచ్చిన వాసిన రూపు పరమాత్ముఁడు బచ్చు చేతి వొరగల్లు పరమాత్ముఁడు యిచ్చకొలఁది వాడువో యీ పరమాత్ముఁడు ॥చ3॥ పలుకుల లోని తేట పరమాత్ముఁడు ఫలియించు నిందరికిఁ బరమాత్ముఁడు బలిమి శ్రీవేంకటాద్రి పరమాత్ముఁడు యెలమి జీవుల ప్రాణ మీ పరమాత్ముఁడు |
రాగము: రామక్రియ రేకు: 0084-06 సంపుటము: 1-410 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, రామక్రియ