బాబు సమస్యను రాష్ట్రాల సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం

 ఫోన్లో మాట్లాడిన ఆ గొంతు చంద్రబాబుదే

కడప: ఓటుకు నోటు వ్యవహారంలో ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో ఫోన్ లో మాట్లాడుతూ దొరికిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మండలి ప్రతిపక్ష నేత సి. రామచంద్రయ్య డిమాండ్ చేశారు. చంద్రబాబు వెంటనే తన ముఖ్యమంత్రిపదవికి రాజీనామా చేసి ఏసీబీ విచారణకు సిద్ధపడాలన్నారు.

కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటుకు నోటు వ్యవహారం ప్రభుత్వానికి సంబంధించింది కాదన్నారు. నిన్నటి రేవంత్‌రెడ్డి వీడియో నేటి చంద్రబాబు ఆడియో రెండూ కళ్లెదుట కన్పిస్తున్నాయని అయినా చంద్రబాబు ఇతరులపై అభాండాలు వేస్తున్నారని విమర్శించారు.

చదవండి :  7న కడపకు బాబు

నూటికి నూరు శాతం ఆ ఫోన్ లో మాట్లాడిన గొంతు చంద్రబాబుదేనన్నారు. ఒకవేళ కాకపోతే ఫోరెనిక్స్ ల్యాబ్ లో టెస్ట్ చేయించుకోవచ్చని రామచంద్రయ్య పేర్కొన్నారు. ‘చంద్రబాబు మాట్లాడేతీరు, యాస, భాష నాకు పూర్తిగా తెలుసు. ఈ వాయిస్ నాది కాదంటూ ఇప్పుడు వివాదం చేస్తున్నారు. ల్యాబ్ కు పంపిస్తే నిజాలు బయటకు వస్తాయి’ అన్నారు.

ముడుపులు వ్యవహారంలో చంద్రబాబు చేసింది పూర్తిగా వ్యక్తిగతం. కాని దీన్ని రాష్ట్రాల మధ్య యుద్ధంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

చదవండి :  రుణమాఫీ అమలు కోసం జిల్లావ్యాప్తంగా ధర్నాలు

పరకాల ప్రభాకర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో దీన్ని రాష్ట్రాల మధ్య యుద్ధంగా చూపించే ప్రయత్నం చేశారు. ఇరు రాష్ట్రాల ప్రజలు చాలా బాగున్నారన్నారు.

చంద్రబాబు వ్యక్తిగత పనులపై పరకాల ప్రభాకర్ ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారని రామచంద్రయ్య ప్రశ్నించారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి జవాబుదారీ తనంగా ఉండాలేకానీ ముఖ్యమంత్రి వ్యక్తిగతంపై కాదన్నారు.

ఇదీ చదవండి!

emperor of corruption

ఎంపరర్ ఆఫ్ కరప్షన్ ఈ-పుస్తకం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ పేర వైఎస్సార్ కాంగ్రెస్ ప్రచురించిన పుస్తకం. ఈ పుస్తకాన్ని …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: