సోమవారం , 23 డిసెంబర్ 2024
plastic in kdapa city

సూపర్‌కాయితం సిత్తుల గుట్టు రట్టు చేసిన మేయర్

కడప: నగరంలో నిత్యం రద్దీగా ఉండే బీకేఎం వీధిలోభారీగా సూపర్ కాయితం సిత్తుల నిల్వలు బయటపడ్డాయి. స్వాధీనం చేసుకున్న సంచుల విలువ రూ.20 లక్షలు ఉంటుందని నగరపాలక అధికారులు తెలిపారు. ప్లాస్టిక్‌సంచుల నిల్వల గుట్టును నగర మేయర్ సురేష్ బాబు రట్టు చేయటం విశేషంగా కనిపిస్తోంది.

నగర మేయర్ సురేష్‌బాబు, నగరపాలక సంస్థ కమిషనరు కొంతకాలంగా ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టటానికి చర్యలు తీసుకుంటున్నారు. బీకేఎం వీధిలోని టోకు వ్యాపారులు భారీ స్థాయిలో ప్లాస్టిక్ సంచులను మార్కెట్లలోకి విడుదల చేయటం వల్లే నిషేధం సాధ్యం కావటంలేదని విమర్శలు వెల్లువెత్తాయి.

చదవండి :  ఔను..వీళ్ళు కూడా అంతే!

పక్కా ప్రణాళిక ప్రకారం మేయర్ సురేష్‌బాబు అనుచరులు కొందరు వ్యక్తులు సూపర్ కాయితం సిత్తులు భారీ స్థాయిలో కావాలని హోల్‌సేల్ వ్యాపారిని సంప్రదించారు. ఒకేసారి రూ.లక్షల్లో వ్యాపారం చేయచ్చన్న ఉద్దేశంతో సదరు వ్యాపారి ప్లాస్టిక్ సంచుల గోదాము వద్దకు వారిని తీసుకుపోయారు.

అక్కడ ఒక భవనంలోని మొదటి అంతస్తు మొత్తం సూపర్ కాయితం సిత్తుల గట్టాలతో నిండపోయి ఉండటంతో వారు విషయాన్ని వెంటనే మేయరుకు తెలియజేశారు. స్థానిక శాసనసభ్యుడు అంజద్ బాషతో కలిసి అక్కడికి చేరుకున్న మేయరు సూపర్ కాయితం నిల్వలను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో నగరపాలక అధికారులు అక్కడికి చేరుకుని సూపర్ కాయితం సిత్తులను స్వాధీనం చేసుకున్నారు.

చదవండి :  కడపలో సినీ నటుడు బ్రహ్మాజీ

చిన్న చిన్న హోటళ్లు, తోపుడుబండ్ల వ్యాపారులపై దాడులు జరిపి అపరాధ రుసుము వసూలు చేసే నగరపాలక అధికారుల దృష్టికి ఇంత పెద్ద స్థాయిలో  జరుగుతున్న ప్లాస్టిక్ వ్యాపారం ఎందుకు రాలేదో?

ఇదీ చదవండి!

పాస్‌పోర్ట్ సేవలు

ఏప్రిల్ 3 నుండి కడపలో పాస్‌పోర్ట్ సేవలు

కడపలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు విదేశాంగ మరియు తపాల శాఖల మధ్య అవగాహనా ఒప్పందం జిల్లా వాసులకు తిరుపతి …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: