జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వ నిర్లక్ష్యం

    జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వ నిర్లక్ష్యం

    ప్రొద్దుటూరు: రాష్ట్ర విభజనానంతరం కడప జిల్లా అభివృద్ధి పట్ల ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని జవివే  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తవ్వా సురేష్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు రమణయ్య శుక్రవారం డిప్యూటీ తహశీల్దార్ మహబూబ్‌బాషాకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వంపై వత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. శివరామకృష్ణన్ కమిటీ జిల్లాను ఇంకా సందర్శించలేదన్నారు. ప్రభుత్వం కేంద్ర విద్యా సంస్థ ను ప్రకటించలేదని, రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు ఎలాంటి ప్రయోజనం జరగలేదని పేర్కొన్నారు.

    చదవండి :  28 నుంచి అక్టోబర్‌ 6 వరకు ట్రిపుల్ ఐటికి దసరా సెలవలు

    జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ, ఐఐటీ, ఐఐఎం, మైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఎయిమ్స్ లాంటి సంస్థలను, అంతర్జాతీయ భాషా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వ్యాపార ప్రయోజనాలే కాకుండా చారిత్రక నేపథ్యం, భవిష్యత్తు తరాల ఐక్యత, సమగ్రతను దృష్టిలో పెట్టుకుని రాజధానిపై శాస్త్రీయమైన, పారదర్శకమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కడప-రేణిగుంట, కడప-చిత్తూరు, కడప-బెంగుళూరు రోడ్లను 4 లైన్లుగా మార్చాలన్నారు. కార్యక్రమంలో జేవీవీ పట్టణ కార్యదర్శి రమణ, గోపినాథరెడ్డి, రాజేష్‌రెడ్డి, రచయిత జింకా సుబ్రమణ్యం పాల్గొన్నారు.

    చదవండి :  'ఉక్కు' నివేదిక ఏమైంది?

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *