‘సీమకు ప్రత్యేక హోదా కల్పించాల’:రామానాయుడు

రైల్వేకోడూరు : రాయలసీమకు ప్రత్యేక హోదా కల్పించాలని, ప్రత్యేకప్యాకేజి కేటాయించాల ని, లక్షమందికి ఉపాధికల్పించే ఉక్కుపరిశ్రమ ను కడపలో నిర్మించాలని రాష్ట్ర సీసీఐ కార్యవర్గసభ్యులు రామానాయుడు డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక పిఎస్‌ఆర్‌ కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశం లో ఆయన మాట్లాడుతూ సెయిల్‌ ఆధ్వర్యం లో ఉక్కుపరిశ్రమను స్థాపించాలన్నారు. తెలుగుగంగకు 29టిఎంసిలు, హంద్రీనీవాకు 40 టిఎంసిలు, గాలేరు-నగిరికి 38టిఎంసిలు, వెలి గొండ ప్రాజెక్టులకు 43.5 టిఎంసిల నికరజలాలను కేటాయించాలన్నారు. తగినన్ని నిధులు మంజూరుచేసి ఆయా ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కడపలో హైకోర్టును ఏర్పాటు చేయాలన్నారు. కడపలో ఉన్న రిమ్స్‌ను ఎయిమ్స్‌గా రూపొందించాలన్నారు.

చదవండి :  కోస్తా వారు చేస్తున్న మరో మోసమే 'పట్టిసీమ'

ఇండియన్‌ మిలిటరీ అకాడమిని కడపలో ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో ఉన్న ఆర్‌టిపిపి సామర్ధ్యాన్ని పెంచేందుకు ప్రస్తుతం ఉ్నన 1050 మెగావాట్‌లను, నిర్మాణంలో ఉన్ననున్న 600మెగావాట్స్‌లతో పాటుగా అదనంగా 800మెగావాట్లల విద్యుత్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా సిపి ఐ కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ జిల్లాలో జాతీయ ఎర్రచందనం  పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు.

జిల్లా కార్యవర్గసభ్యులు పులిక్రిష్ణమూర్తి మా ట్లాడుతూ కడపలో బ్రహ్మణీ స్టీల్స్‌ వద్ద ఎయి ర్‌పోర్టు కోసం సేకరించిన 4500ఎకరాల్లో ఏరో నాటికల్‌ ఇంజినీరింగ్‌ కళాశాలను, ఏవియేషన్‌ ఇండియా లిమిటెడ్‌ను ఏర్పాటు చేయాలన్నా రు. కడప వినాశ్రయాన్ని జాతీయస్థాయికి కేటగిరిలో చేర్చివెంటనే ప్రారంభించాలన్నారు. జి ల్లాలో ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కళాశాలను ఏర్పాటుచేయాలన్నారు. కడప-బెంగుళూరు, ఓబులవారిపల్లె-క్రిష్ణపట్నం, యర్రగుంట్ల-నంద్యాల, భాకరాపేట-గిద్దలూరు లమధ్య రైల్వేలైన్‌లను ని ర్థిష్ట కాలవ్యధిలో పూర్తిచేయాలన్నారు. నందలూరులో లోకోషెడ్‌ను తిరిగి ఏర్పాటు చేయాలన్నారు. కడప- విజయవాడకు నాలుగులైన్లు హైవేరోడ్డును ఏర్పాటు చేయాలన్నారు. కడప-తిరుపతిల మధ్య కారిడార్‌ను ఏర్పాటు చేయాలన్నారు. సహకారరంగంలో మాతపడిన ప్రోద్దుటూరు పాలకేంద్రం, చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీలను పునరుద్ధరించాలన్నారు.

చదవండి :  తాగే నీళ్ళ కోసం..ఖాళీ బిందెలతో ఆందోళన

సిపిఐ సీనియర్‌ నాయకులు సికెమూర్తి మాట్లాడుతూ ఖనిజ నిక్షేపాలు విస్తారంగా కల్గిన రాయలసీమలో నేషనల్‌మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ పరిశోధనాకేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. మైనింగ్‌ యూనివర్శిటిని స్థాపించాలన్నారు.

కోడూరు ఏరియా కార్యదిర్శి పండుగోలమ ణి మాట్లాడుతూ సౌత్‌ఇండియా టెక్స్‌టైల్స్‌ రీ సెర్చ్‌ కేంద్రాన్ని స్థాపించాలన్నారు. కోడూరులో సెంట్రల్‌ ఫుడ్‌ మరియు ఫ్రూట్‌ పరిశోధనాకేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు.

సిపిఐ సీనియర్‌ నాయకులు శంకరయ్య మాట్లాడుతూ సున్నపురాయికి ప్రసిద్ధిగాంచిన కడపజిల్లాలో ప్రభుత్వరంగంలో భారీసిమెంట్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలన్నారు.

చదవండి :  దేవుని కడప

రాష్ట్రవ్యవసాయ కార్మిక కమిటీ సభ్యురాలు ఓరుగంటినర్మదకుమారి మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చి హామీలను నెరవేర్చకపోతే మాత్రం ప్రజలు బుద్ధిచెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో ిసీపీఐ నాయకులు రాధాక్రిష్ణ, నాయకులు చెన్నయ్య, శ్రీరా ములు, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారుత,ఖిర-5ట

ఇదీ చదవండి!

ఎద్దుల ఈశ్వర్ రెడ్డి

జిల్లాపై ప్రభుత్వ తీరుకు నిరసనగా 22 నుంచి 24 వరకు ధర్నాలు

కమలాపురం: కడప జిల్లా పై ప్రభత్వ వివక్షకు నిరసనగా మరియు జిల్లా సమగ్రాభివృద్ధిని కోరుతూ.. ఈ నెల 22, 23, …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: