వదలని హైటెక్ వాసనలు

కడపలో ఐటీ పరిశ్రమను ఏర్పాటు చేసి ఐటీహబ్‌గా మార్చడంతో పాటు స్మార్ట్‌సిటీగా కడపను తయారు చేస్తానని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.

సోమవారం సాయంత్రం మున్సిపల్ గ్రౌండ్‌లో జరిగిన ప్రజాగర్జన లో బాబు మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరందిస్తానన్నారు.

హైదరాబాద్‌ను తలదన్నేలా కడపను అభివృద్ధి చేసి హైటెక్‌సిటీని నిర్మిస్తామన్నారు. ఇక్కడ చదువుకున్న వారికి కడపలోనే ఉద్యోగాలు ఇచ్చేలా చేస్తానన్నారు.

ఎందరో మహానీయులు జన్మించిన గడ్డ కడప, ఇలాంటి తులసి వనంలో గంజాయి మొక్కలాంటి వాడు పుట్టాడని పరోక్షంగా జగన్‌ను విమర్శించారు. పులివెందుల నేరస్తులకు స్థావరంగా మారిందన్నారు.

చదవండి :  'చంద్రబాబు మాట నిలుపుకోవాల'

కడప ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేయడంతో పాటు ఇక్కడ నున్న వనరులతో పరిశ్రమలు స్థాపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఎం రమేష్, పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి తదితరులు ప్రసంగించారు. జేసీ దివాకర్‌రెడ్డి, కందుల రాజమోహన్‌రెడ్డి, ఖలీల్‌బాష, శ్రీనివాసులు, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి పలువురు మాట్లాడారు.

ఎమ్మెల్యేలు వీరశివారెడ్డి, కందికుంట ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, రమేష్‌రెడ్డి, విజయమ్మ, ఆ పార్టీ నే తలు పుట్టా సుధాకర్‌యాదవ్, విజయజ్యోతి, మేడా మల్లికార్జునరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, ప్రసాద్‌బాబు, గోవర్థన్‌రెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, సుబాన్‌బాష, రామ్‌గోపాల్‌రెడ్డి, పెద్దచెప్పలి సింగిల్‌విండో అధ్యక్షుడు సాయినాథశర్మ, ఎన్ఆర్ఐ వేమన సతీష్ తదితరులు ఈ గర్జనకు హాజరయ్యారు.

చదవండి :  'ప్రారంభోత్సవం ఎందుకు ఆపారో చెప్పాల'

మొత్తానికి చంద్రబాబు మళ్ళీ హైటెక్ బాట పట్టినట్లున్నారు. గత 19 సంవత్సరాలలో తను తెదేపా అధిపతిగా వ్యవహరించిన సమయంలో కడప జిల్లాపై తీసుకున్న వైఖరికి భిన్నంగా బాబు కడప గడపన హైటెక్ హామీలు గుప్పించారు.

వీటిని కడప జిల్లా ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారో తెలియాలంటే ఎన్నికలయ్యే దాకా వేచి చూడాల్సిందే!

ఇదీ చదవండి!

పచ్చని విషం

పోతిరెడ్డిపాడును నిరసిస్తూ అవిశ్వాసం పెట్టిన తెలుగుదేశం

2008 శాసనసభ సమావేశాలలో ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా తెలుగుదేశం పార్టీ పోతిరెడ్డిపాడు వెడల్పు కారణంగా అవిశ్వాసం …

3 వ్యాఖ్యలు

  1. లేవలేను గానీ లేచానంటే మనిషిని కాదన్నాడట వెనకటికొకడు.

  2. nuvvu edo site open chesi maa cbn gurinchi chedu ga chepte janalu nammutaranukunnava…

    • అయ్యా! నూర్ అలియాస్ ఆకుల చిట్టి గారు మీ బాబు గురించి నమ్మటం, నమ్మకపోవటం అన్నది మీ ఇష్టం! నమ్మమని మేము ఎవరినీ బలవంత పెట్టడం లేదు. ఇది కేవలం మా అభిప్రాయం మాత్రమే. నమ్మటం, నమ్మకపోవటం అన్నది మీ ఇష్టం. ఎవరో రాస్తే అందరూ నమ్మలనేం రూలు లేదు. అలా అందరూ నమ్మరు కూడా. మీరు వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: