పుష్పగిరి బ్రహ్మోత్సవాలు
పెన్నేటి గట్టున ఉన్న పుష్పగిరి చెన్నకేశవుని ఆలయం

11 రోజులపాటు పుష్పగిరి బ్రహ్మోత్సవాలు

కడప: పుష్పగిరి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు 11 రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 20న చందనోత్సవం, 21న గరుడవాహనం, 22న కల్యాణం, 23 రధోత్సవం నిర్వహిస్తారు.

వెయ్యిసంవత్సరాల పురాతత్వ విశేషం కలిగిన పుష్పగిరిలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు వల్లూరు మండల అధికారులు, పుష్పగిరి మఠం వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ఉత్సవాల్లో తొలిసారిగా ఏడు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్టస్థ్రాయి పోటీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. గ్రామీణ క్రీడలు, మేధోక్రీడలు, చిత్రలేఖన సాహిత్యం, సంస్కృతికి ప్రతిబింబాలుగా ఏడు అంశాలలో, ఏడు రకాల పోటీలు రాష్టస్థ్రాయిలో ప్రథమంగా నిర్వహిస్తున్నట్లు వల్లూరు ఎంపిడిఓ మొగిలిచెండు సురేష్ తెలిపారు.

చదవండి :  వైభవంగా శ్రీవారి పుష్పయాగం

కబడీ, బండలాగుడు పోటీలు, చిత్రకళ, ఏకపాత్రాభినయం, కవిసమ్మేళనం, చదరంగం, అల్లెంగుండు వంటి ఏడు విభిన్నరకాల పోటీలు నిర్వహిస్తున్నారు. రాష్టస్థ్రాయిలో జరిగే పోటీల్లో ఎవరైనా పాల్గొనవచ్చునన్నారు.

ఇదీ చదవండి!

పుష్పగిరిలో సినిమా చిత్రీకరణ

కడప : జిల్లాలోని పవిత్రపుణ్యక్షేత్రం పుష్పగిరిలో శనివారం సాయంత్రం శ్రీజ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న (ఇంకాపేరుపెట్టని) ప్రొడక్షన్‌నెంబరు1 సినిమా చిత్రీకరణ జరిగింది.  నిర్మాణంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: