punugu pilli

అరుదయిన పునుగుపిల్లి దొరికింది!

కడప: జిల్లాలోని నందలూరు మండలం పాటూరు గ్రామ పొలంలో గురువారం పిల్లి జాతికి చెందిన అరుదయిన పునుగుపిల్లి దొరికింది. గ్రామానికి చెందిన రైతు కోటకొండ సుబ్రహ్మణ్యం తాను సాగుచేసిన కర్భూజ పంటను పందులు, పందికొక్కులు నాశనం చేయకుండా బోను ఏర్పాటు చేశారు. ఆ బోనులో పునుగుపిల్లి చిక్కుకొంది.

పాటూరు  మాజీ సర్పంచి గాలా సుధాకరరెడ్డి ఈ విషయాన్ని తిరుపతిలోని జంతు ప్రదర్శనశాల అధికారి పార్థసారధి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో  గురువారం సాయంత్రం ఎస్వీ జంతుప్రదర్శనశాలకు చెందిన సెల్వరాజ్, అటవీఅధికారి వెంకటరమణ తమ సిబ్బందితో పాటూరుకు  వచ్చారు.

చదవండి :  పరీక్షలు జరిగిన 24 గంటల్లోపే పీజీసెట్ ఫలితాలు

పునుగుపిల్లిని పరిశీలించి తమవెంట తిరుపతి జంతు ప్రదర్శనశాలకు తీసుకెళ్లారు.

తిరుమలలో  ప్రతి శుక్రవారం అభిషేకం తరువాత కాస్తంత పునుగు తైలాన్ని శ్రీవారి  విగ్రహానికి పులుముతారు. టీటీడీ అధికారులు గోశాలలో పిల్లులను పెంచుకుంటూ వాటి నుంచి తైలాన్ని సేకరించేవారు. 1972లో కేంద్ర ప్రభుత్వం వన్య ప్రాణ సంరక్షణా చట్టం తెచ్చింది.

వన్య ప్రాణి అయిన పునుగు పిల్లిని పెంచుకోవడం చట్ట ప్రకారం తప్పు అంటూ జీవకారుణ్య పర్యావరణ సంరక్షణా సంఘాలు గోశాలలో పునుగు పిల్లుల పెంపకంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి.

చదవండి :  'ఉక్కు' నివేదిక ఏమైంది?

దైవ కార్యక్రమాలకు వన్య ప్రాణుల సేవలను వినియోగించుకోవచ్చుననే క్లాజును ఆసరాగా చేసుకుని పునుగుపిల్లుల పెంపకానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి కేంద్ర జూ అధారిటీ అనుమతి ఇచ్చింది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: