
పాలెమాలికి లేదా పాలుమాలికి లేదా పాలుమాలిక అనే పదానికి అర్థాలు, వివరణలు
కడప జిల్లాలో వాడుకలో ఉన్న పాలెమాలికి లేదా పాలుమాలికి అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms or Meanings of the word ‘పాలుమాలికి’ in Telugu Language.
పాలెమాలికి లేదా పాలుమాలికి :
నామవాచకం (noun), ఏకవచనం (Singular)
- అనారోగ్యం
- నలత
- నీరసము
- బద్ధకము
- అలపు
- అలమట
- అలయిక
- అలసట
- అల్లాటము
- ఆయాసము
- ఓలాకు
- గాసి
- గుడాక
- గ్లాని, డప్పి
- తందర
- తాంతి
- నకనక
- నలంకువ
- నలకువ
- illness (ఆంగ్లం)
- dizziness (ఆంగ్లం)
- imbecility (ఆంగ్లం)
వివరణ :
పాలెమాలికి లేదా పాలుమాలికి లేదా పాలుమాలిక అనేది అనారోగ్యం లేదా నలతను సూచించే ఒక పదం . కడప జిల్లాలో పాలుమాలిక అనే పదాన్ని illness అనే ఇంగ్లీషు పదానికి సమానార్థకంగా వాడతారు. దీనినే కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ‘పాలుమాలికి ‘ లేదా ‘పాలుమాలిక’ అని కూడా వ్యవహరిస్తారు.
వాడుక :
- పాలుమాలిక చేసి కళ్ళు తిరుగుతానయ్
- పాలెమాలికి చేసిందని ఆస్పత్రికి పోయొచ్చినా