పాలకొలను నారాయణరెడ్డి ఇక లేరు

మైదుకూరు మాజీ శాసనసభ్యుడు పాలకొలను నారాయణ రెడ్డి (84) సోమవారం హైదరాబాదులో కన్ను మూశారు. ఆయన 1962-67 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మైదుకూరు నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహించారు.

పాలకొలను నారాయణరెడ్డి

పోరుమామిళ్ల మండలం అక్కలరెడ్డిపల్లెలో పిచ్చమ్మ, వెంకటసుబ్బారెడ్డి దంపతులకు 1936 ఆగస్టు 9వ తేదీన జన్మించారు. నారాయణ రెడ్డి బి.ఎ. ఎల్.ఎల్.బి చదివి మొదట న్యాయవాద వృత్తిని చేపట్టి అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1967లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థి పి.ఎల్.రెడ్డిపై నారాయణరెడ్డి సుమారు  6వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నారాయణరెడ్డికి 19119 ఓట్లురాగా పి. ఎల్. రెడ్డికి  13402 ఓట్లు వచ్చాయి.

చదవండి :  పాలకవర్గాలు ఏర్పడినాయి!
వైఎస్ తో  పాలకొలను నారాయణరెడ్డి
వైఎస్ తో పాలకొలను నారాయణరెడ్డి

నారాయణ మృతిపట్ల బంధువులు, శ్రేయోభిలాషులు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన భోతిక కాయానికి మంగళవారం హైదరాబాదులోని జూబ్లీ హిల్స్ లో అంత్యక్రియలు జరుగుతాయి.

ఇదీ చదవండి!

ప్రాణుల పేర్లు

చిరుతపులిని తగులబెట్టిన రైతు

మైదుకూరు: మండలంలోని మిట్టమానుపల్లెకు చెందిన రైతు మూలే రామసుబ్బారెడ్డి తన పంటపొలాలను అడవి జంతువుల నుంచి రక్షించుకొనే నేపధ్యంలో తన …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: