పదోతరగతి ఫలితాల్లో
image source: indianexpress.com

పదోతరగతి ఫలితాల్లో కడప జిల్లాదే అగ్రస్థానం

98.89 శాతం ఉత్తీర్ణత

797 మందికి పదికి పది జిపిఏ

కడప: పదోతరగతి ఫలితాల్లో మళ్లీ మనోళ్ళు సత్తా చాటారు. కడప జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపారు. పదోతరగతిలో కడప జిల్లా విద్యార్థులు 98.89 శాతం ఉత్తీర్ణత (Pass) సాధించి జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టారు. మొత్తం 797 మంది విద్యార్థులు (2.2 శాతం) పదికి పది జీపీఏ సాధించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచారు.

జిల్లా విద్యాశ్ఖాదికారులు  తెలిపిన సమాచారం ప్రకారం 2015-16 విద్యాసంవత్సరానికి గాను జిల్లాలో 832 పాఠశాలల నుంచి 35,840 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 35420 మంది పాసయ్యారు. 415 మంది మాత్రమే పరీక్ష తప్పారు. బాలురు 18,487 మంది పరీక్షకు హాజరుకాగా 98.81 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 17,353 మంది పరీక్ష రాయగా 17,157 మంది (98.97 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 0.16 స్వల్ఫ శాతం పెరుగుదలతో బాలుర కంటే బాలికలే ఉత్తీర్ణతలో ముందున్నారు.

చదవండి :  మార్చి 17వతేదీవరకు కడపలో టెలీసీరియల్‌ చిత్రీకరణ

కడప జిల్లా నుండి 2014లో 87 మంది, 2015లో 484 మంది పదికి పది  జీపీఏ సాధించగా ఈ సంవత్సరం 797 మంది పదికి పది జీపీఏ సాధించారు. అంటే మొత్తం విద్యార్థుల్లో 2.20 శాతం మంది పదికి పది జిపిఏ సాధించారు. తూర్పుగోదావరి జిల్లాలో 1,052 మంది విద్యార్థులు పదికి పది జీపీఏ లభించినప్పటికీ అది పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్యలో 1.56 శాతమే కావడం గమనార్హం.

ఈ సందర్భంలో జిల్లా విద్యాశాఖాధికారి ప్రతాపరెడ్డి మట్లాడుతూ.. గురువులందరి సమిష్టి కృషి ఫలితంగా రెండోసారి ఉత్తమ ఫలితాలను సొంతం చేసుకోగలిగామన్నారు. ‘నైట్‌విజన్‌’ పేరుతో విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు వెళ్లి ఎలా చదువుతున్నది తెలుసుకునేవారన్నారు. విషయనిపుణులైన వంద మంది ఉపాధ్యాయుల బృందంతో వీడియో పాఠాలు రూపొందించి అందరికీ అందజేశామన్నారు. వెబ్‌సైట్‌లో ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉంచడంవల్ల వాటిని దిగుమతి చేసుకుని పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులు సాధన చేయించారన్నారు. విద్యార్థులను ఏబీసీడీ విభాగాలుగా వర్గీకరించి వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.

చదవండి :  మైలవరంలో 'మర్యాద రామన్న' చిత్రీకరణ

కడప జిల్లాను వరుసగా రెండో సారి అగ్రపథాన నిలిపి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందనలు!

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: