పోతిరెడ్డిపాడును

పట్టిసీమ డెల్టా అవసరాల కోసమే : నిజం చెప్పిన చంద్రబాబు

కడప : ఇన్నాళ్ళూ పట్టిసీమ రాయలసీమ కోసమేనని దబాయిస్తూ అబద్దాలాడుతూ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎట్టకేలకు నిజం చెప్పారు. పట్టిసీమ కృష్ణా డెల్టా కోసమే తీసుకొచ్చామని, తద్వారా ఎగువన కురిసే వర్షాలు, నీటి లభ్యతతో సంబంధం లేకుండా డెల్టాకు ముందుగానే నీరివ్వగలుగుతున్నామని స్పష్టం చేశారు.

పట్టిసీమ ద్వారా వచ్చి చేరిన నీటితో ప్రకాశం బ్యారేజిలో నీటి మట్టం 11.2 అడుగులకు చేరింది. దీంతో జూన్ 22న కృష్ణా డెల్టా తూర్పు కాలువకు ఆయన నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణాలో నీరు లేక చివరవరకు ఉన్న కొద్దిపాటి నీరు ఉప్పుగా మారిందన్నారు. సాగు భూములు కూడా చౌడుబారాయన్నారు. గత ఏడాడి 55 టీఎంసీల మేరకు పట్టిసీమ నీటిని ఇవ్వడం వల్ల ఖరీఫ్లో రైతులు ఎప్పుడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో పంటలు పండించారన్నారు. ఇదే సందర్భంలో 2016లో సముద్రం పాలైన 55 టిఎంసిల నీటి గురించి ప్రస్తావించకుండా ముఖ్యమంత్రి జాగ్రత్త పడ్డారు.

చదవండి :  పచ్చచొక్కాల వారితోనే ప్రభుత్వ కార్యక్రమమా?

పట్టిసీమ ద్వారా ఆదా అయ్యాయి అని చెబుతున్న నీటిని రాయలసీమకు నికరజలాలుగా కేటాయించాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నా పట్టించుకోని చంద్రబాబు కనీసం తను తెచ్చిన జీవో 69ని రద్దు చేయటానికి కూడా ముందుకు రావడం లేదు.

ఆధారాలు :

1: ABN ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన ముఖ్యమంత్రి ప్రసంగం , లంకె : https://www.youtube.com/watch?v=B4MGOFo_4bI

2. ఈనాడు వారి కథనం, లంకె : http://m.dailyhunt.in/news/india/telugu/eenadu-epaper-eena/pattisima+nitito+delta+raitullo+aanandam+kru-newsid-69491897

3. ఆంధ్రజ్యోతి కథనం : http://www.andhrajyothy.com/artical?SID=165938

4. తెదేపా వారి ఒక సైటు కథనం : http://www.amaravativoice.com/avnews/news/farmer-writes-open-letter-on-pattiseema

చదవండి :  పువ్వు పార్టీలో చేరిన ఆదినారాయణ

ఇదీ చదవండి!

కృష్ణా డెల్టాకు

శ్రీశైలంతో కృష్ణా డెల్టాకు అనుబంధం తొలిగిపోయిందిలా!

యనమల రామకృష్ణుడు గారు 2016 -17 ఆంద్రప్రదేశ్ రాష్ట్ర బడ్జట్ శాసనసభలో ప్రవేశ పెడుతూ చేసిన ప్రసంగంలో “గోదావరి, క్రిష్ణా …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: