
నల్లారి వారి కొత్త పార్టీ ఖాయమే!
తెలుగువారి ఆత్మగౌరవం కోసం కొత్త పార్టీని పెడుతున్నామని రాయలసీమకే చెందిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తెలుగువారి కి అవమానాలు ఎదురైతే ఎదుర్కోవడమే తమ పార్టీ లక్ష్యమని కిరణ్ అన్నారు.
పన్నెండో తేదీ సాయంత్రం రాజమండ్రిలో సభ పెట్టి పార్టీ విధానాలను ప్రకటిస్తామని కిరణ్ అన్నారు.తన జీవితం తెరచిన పుస్తకం అని అన్నారు.తనపై ఆరోపణలను రుజువు చేయాలని కిరణ్ సవాల్ చేశారు.అన్ని నిబంధల ప్రకారమే జరిగాయని అన్నారు.
రాయలసీమకే చెందిన జగన్, చంద్రబాబులు ఇప్పటికే రెండు ప్రధాన పార్టీలకు నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే! ఇప్పుడు కిరణ్ వంతు!
వీరంతా సీమ సమస్యలపైన మాట్లాడతారా? కనీసం విభజన నేపధ్యంలో సీమ ఎదుర్కోబోతున్న సవాళ్లకు వీల్లెవరైనా పరిష్కారాలు చూపుతారా?
షరా మామూలుగా కోస్తా వారి ఓటు బ్యాంకు కోసం సీమ భవిష్యత్తును పణంగా పెట్టరాదని కోరుకుందాం!!