మా అల్లుడు పోటీ చేయరు

లింగాల : కడప పార్లమెంట్‌కు త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో తన అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పోటీలో ఉండరని వ్యవసాయశాఖ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి తెలిపారు.

లింగాల కుడికాలువను ఆయన గురువారం పరిశీలించారు. అనంతరం ఎంపీపీ ఇంట్లో ఆయన విలేకరులతోమాట్లాడారు.రాజశేఖరరెడ్డికి పార్టీ ఎంపీ టిక్కెట్ వద్దని చెప్పడానికే ఢిల్లీ వెళ్లానన్నారు. ఎమ్మెల్సీ టిక్కెట్ అడగలేదని, అధిష్టానం ఆదేశాల మేరకు పని చేస్తానన్నారు.

ఎమ్మెల్సీ టిక్కెట్ ఎవరికిస్తారనే దానిపై ఆయన స్పందిస్తూ నారాయణరెడ్డి, గోవిందరెడ్డి, వరదరాజులరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయన్నారు. దీనికోసం ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులతో చర్చిస్తామన్నారు.

చదవండి :  జగన్ కే ఓటు వేసిన వివేకా భార్య ?

ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు అధికంగా కాంగ్రెస్ పార్టీకి చెందినవారే ఉన్నారన్నారు. వీరిలో జగన్ వర్గంకు చెందినవారు ఉన్నారాలేరాఅని తెలుసుకునేందుకు మండలాల వారీగా స్థానిక సంస్థల ప్రతినిధులతో చర్చిస్తామన్నారు.

ఇదీ చదవండి!

ఆదినారాయణ రెడ్డి

తిరిగొచ్చిన ఆది

జమ్మలమడుగు కాంగ్రెస్ శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి వైకాపా గూటికి తిరిగొచ్చారు. ఈ రోజు హైదరాబాదులో దీక్ష చేస్తున్న జగన్ సమక్షంలో పార్టీలో …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: