
దైవమ నీవే గతి మాతప్పులు పనిలేదు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ దైవమ నీవే గతి మాతప్పులు పనిలేదు శ్రీవల్లభుడవు నీవే చేకొని కావఁగదే ॥చ1॥ జనని నీమాయా జనకుఁడవు నీవు జనులము నేమిందర మొకసంతతిబిడ్డలము వొనరెడి దినభోగములు వూరేటిచనుబాలు మునుకొను మానడవళ్లివి ముద్దులు మీ కివివో ॥చ2॥ ధర బశుపక్షిమృగాదులు తగ తోఁబుట్టుగులు వురుటగు మాదేహంబులు వుయ్యలతొట్టెలలు మరిగినసంసారము బొమ్మరిండ్లయాట లివి నిరతి మాయజ్ఞానంబు నీకు నవ్వులయ్యా ॥చ3॥ చావులుఁ బుట్టుగు లాడెడిసరి దాగిలిముచ్చిములు భావపుటారంభంబులు బాలలీలగతులు కైవశమందఁగ శ్రీవేంకటపతి నీదాస్యం బిది మావంటివారికెల్లను నీమన్ననలాలనలు |
రాగము: గుజ్జరి రేకు: 0090-05 సంపుటము: 1-445 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, గుజ్జరి