కక్షతో జిల్లా అభివృద్ధిని పట్టించుకోవడం లేదు

రాజంపేట: జిల్లా ప్రజలు వైకాపాకు పట్టం కట్టారనే కక్షతో తెదేపా ప్రభుత్వం జిల్లా అభివృద్ధిని పట్టించుకోవడంలేదని వైకాపా జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన రాజంపేటలో విలేకరులతో మాట్లాడుతూ… వైఎస్ పాలనలో జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. అయితే ఇప్పుడు ఏ రంగంలోనూ అభివృద్ధి మచ్చుకైనా కానరావడంలేదన్నారు.

కనీసం విమానాశ్రయాన్ని ప్రారంభిస్తే వ్యాపారాలు పెరుగుతాయని, పరిశ్రమలు వస్తాయని ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్నారు. ఈనెల 30న కడపలో నిర్వహించే వైకాపా జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీ వంటి అంశాలపై చర్చించి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామన్నారు. నవంబర్ 5న జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో డ్వాక్రా రుణమాఫీపై ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

చదవండి :  మండలాధ్యక్ష రిజర్వేషన్లు - 27 పురుషులకు, 23 మహిళలకు

ఇదీ చదవండి!

jagan-ramachandraiah

విపక్ష నేతలూ… మా కోసం వస్తారు కదూ..!

అయ్యా.. విపక్ష నేతలూ! కడప జిల్లా ప్రజలు దుర్భర పరిస్థితుల మధ్య ఉపాధి కరువై, ప్రభుత్వ ఆదరువు లేక, రోగాల …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: