
ఒంటిమిట్ట కోదండ రామాలయం
ఒంటిమిట్టలో టీవీ సినిమా చిత్రీకరణ
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి దేవళంలో బుధవారం ఉదయం అన్నమయ్య సంకీర్తనల టీవీ సినిమా చిత్రీకరణ జరిగింది.
ఆలయ రంగమంటపంలో కొలువరో మొక్కురో.. అనే అన్నమయ్య సంకీర్తనను ఆలపించే దృశ్యాన్ని దర్శకుడు ప్రతాప్ చిత్రీకరించారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిపై తాళ్ళపాక అన్నమాచార్యులు రచించిన సంకీర్తనలను దృశ్య రూపంలో చిత్రీకరిస్తున్నామన్నారు. షూటింగ్ పూర్తయ్యాక ఈ టెలీ ఫిలింను శ్రీవారి పాదాల చెంత వుంచి టీటీడీకి అందజేస్తామన్నారు. అంతకుముందు యూనిట్ సభ్యులు స్వామిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు.