రాయలసీమకు అన్యాయం చేసే జీవో 120కి నిరసనగా యస్వీ యూనివర్శిటీ వద్ద నిరసన
రాయలసీమకు అన్యాయం చేసే జీవో 120కి నిరసనగా యస్వీ యూనివర్శిటీ వద్ద విద్యార్థుల నిరసన

జీవో120ని తక్షణమే ఉపసంహరించుకోవాల…

తిరుపతి ధర్నా విజయవంతం

ప్రభుత్వ కనుసన్నల్లో ధర్నా అడ్డుకోవటానికి అధికారుల ప్రయత్నం

తరలివచ్చిన విద్యార్థులు… నేతలు, రాజకీయ పక్షాలు దూరం

(తిరుపతి నుండి అశోక్)

రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడిన జోనల్‌ వ్యవస్థను నీరుగారుస్తూ, రాయలసీమకు అన్యాయం చేస్తూ పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రవేశాల కోసం తీసుకొచ్చిన 120 జీవోను తక్షణమే రద్దు చేయాలని రాయలసీమ ఉద్యమకారులు డిమాండ్ చేశారు. జీవో 120ని నిరసిస్తూ శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో రాయలసీమ పోరాట సమితి, విద్యార్థి సంఘాలు, రాయలసీమ సామాజిక మాధ్యమాల ఫోరంల అధ్వర్యంలో ఈ రోజు (శనివారం) నిర్వహించిన ధర్నా (ఆందోళన) విజయవంతమైంది. ఆందోళనను అడ్డుకునేందుకు ప్రభుత్వం, విశ్వవిద్యాలయ అధికారులు శతధా ప్రయత్నించారు. హైదరాబాదు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి పలువురు విద్యార్థులు, సీమ ఉద్యమకారులు తరలివచ్చారు. సీమ విద్యార్థులకు బాసటగా జరిగిన ఈ ఆందోళనకు వివిధ రాజకీయ పక్షాలకు చెందిన ఏ ఒక్క నేతా హాజరుకాకపోవడం విచారించాల్సిన అంశం.

చదవండి :  కడపలో జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు

రాయలసీమకు అన్యాయం చేసే జీవో 120కి నిరసనగా యస్వీ యూనివర్శిటీ వద్ద నిరసన

విశ్వవిద్యాలయం గేటు బయట శాంతియుతంగా ధర్నా చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న టెంటును తొలగించిన యూనివర్సిటీ అధికారులు భారీగా పోలీసులను మోహరించి ఆందోళనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరకు ఆందోళనకారులు విశ్వవిద్యాలయ అధికారులను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు కూడా పోలీసులు అనుమతించలేదు.

రాయలసీమకు అన్యాయం చేసే జీవో 120కి నిరసనగా యస్వీ యూనివర్శిటీ వద్ద నిరసన
ధర్నాలో భూమన్, బైరెడ్డి

ఈ సందర్భంగా ఆందోళనకారులు ప్రభుత్వ దమననీతిని ఎండగట్టారు. ప్రభుత్వం కనుసన్నల్లో నడుస్తున్న యూనివర్సిటీ ఉపకులపతి, రిజిస్ట్రార్లు ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న ఆందోళనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆర్టికల్ 371(D)ని ఉల్లంఘిస్తూ ప్రభుత్వం ఏకపక్షంగా వెలువరించిన జీవో120ని తక్షణమే రద్దు చేయాలన్నారు. రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డగోలుగా ఈ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెడుతోంటే అడ్డుకోవాల్సిన విపక్ష పార్టీలు, స్థానిక ప్రజాప్రతినిధులు నోరు మెదపకుండా కూర్చోవటం శోచనీయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమకే చెందిన జగన్ (విపక్ష నేత), రామకృష్ణ (సిపిఐ రాష్ట్ర కార్యదర్శి), రఘువీరారెడ్డి (పిసిసి అధ్యక్షుడు) తదితరులు కోస్తా ప్రాంతంలో తమకు ఎక్కడ మైలేజీ తగ్గుంతుందో అని నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సీమ వాసుల దౌర్భాగ్యమన్నారు. ఇలాంటి వైఖరి కారణంగానే రాయలసీమ ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిందని, పరిస్తితి ఇలాగే కొనసాగితే ఇవాళ మెడికల్ సీట్ల విషయంలో జరిగిన దగా అన్నిటా జరుగుతుందని రాయలసీమ విద్యార్థి వేదిక నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వం జీవోను ఉపసంహరించుకోని పక్షంలో ఆందోళనను ఉదృతం చేస్తామని, ప్రభుత్వ కార్యకలాపాలను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ప్రతీ విషయంపైన ఆందోళనలు నిర్వహించే వామపక్ష పార్టీలు కూడా జీవో 120 విషయంలో స్తబ్దుగా ఉన్నాయని విద్యార్థులు మండిపడ్డారు.

చదవండి :  "నారాయణ" లీలలు: రాజధాని కమిటీ మాయ : 1

రాయలసీమకు అన్యాయం చేసే జీవో 120కి నిరసనగా యస్వీ యూనివర్శిటీ వద్ద నిరసన

అనంతరం బైరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… గతంలో తెలంగాణా వాళ్ళను సతాయించినట్లుగా ఇప్పుడు రాయలసీమ వారికి పొమ్మనకుండా పొగబెడుతున్నారన్నారు. ప్రభుత్వం జీవో120ని ఉపసంహరించుకొని పక్షంలో డిల్లీలో ఆందోళన చేస్తామన్నారు.

రాయలసీమకు అన్యాయం చేసే జీవో 120కి నిరసనగా యస్వీ యూనివర్శిటీ వద్ద నిరసన

అధికారులు టెంటు తొలగించినా ఎండను లెక్క చెయ్యకుండా రోడ్డు పైన కూర్చుని ఆందోళన నిర్వహించారు. రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన్, రాయలసీమ విద్యార్థి వేదిక కన్వీనర్ మల్లెల భాస్కర్, రాయలసీమ నిర్మాణ సమితి కన్వీనర్ జనార్ధన్, గ్రేటర్ రాయలసీమ అసోషియేషన్ ఆఫ్ తెలంగాణ కార్యదర్శి రాధారావు, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్, రాయలసీమ సామాజిక మాధ్యమాల ఫోరం కన్వీనర్ అశోకవర్ధన్ రెడ్డి, రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి తదితరులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. మొత్తంగా సుమారు 1500 మంది విద్యార్థులు ఆందోళనలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు.

చదవండి :  పట్టిసీమ డెల్టా అవసరాల కోసమే : నిజం చెప్పిన చంద్రబాబు

రాయలసీమకు అన్యాయం చేసే జీవో 120కి నిరసనగా యస్వీ యూనివర్శిటీ వద్ద నిరసన

ఇదీ చదవండి!

పోతిరెడ్డిపాడును

కడప జిల్లాలో వరి వద్దు చీనీ సాగే ముద్దు

జిల్లా రైతులకు ముఖ్యమంత్రి పరోక్ష సందేశం కడప:  రైతులు కడప జిల్లాలో వరి సాగు చేయకుండా ఉద్యాన పంటలు పండించుకోవాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: