శుక్రవారం , 27 డిసెంబర్ 2024

జిల్లా సంస్కృతిని అందరికీ తెలపాల

కడప: పర్యాటక అభివృద్ధికి జిల్లాలో అనేక ఆదాయ వనరులు ఉన్నాయని, జిల్లా సంస్కృతిని అందరికీ తెలపాలని ఏజేసీ ఎం.సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఏపీ టూరిజం హోటల్‌, జిల్లా పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో హరిత హోటల్‌ ప్రాంగణంలో పర్యాటక ఫొటో ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. పెన్నెటి పబ్లికేషన్‌ ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను సైతం ఆయన పరిశీలించారు.

ఎగ్జిబిషన్‌ ప్రారంభించి తిలకించిన ఏజేసీ ఈ సందర్బంగా మాట్లాడుతూ జిల్లా సంస్కృతిని విద్యార్థులకు తెలిపే విధంగా అందరూ కృషి చేయాలన్నారు. జిల్లా సంస్కృతికి సంబంధించిన కైపియత్తులు,గండికోట చరిత్ర, సాహిత్యం, పర్యాటకం పుస్తకాలు విద్యార్ధులతో పాటు అందరూ చదువుకొనే వీలుగా గ్రంథాలయాల్లో ఏర్పాటు చేసేలా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ సందర్భంగా తవ్వా ఓబులరెడ్డి రచించిన ‘గండికోట’ చరిత్ర పర్యాటక పుస్తకాన్ని కొనుగోలు చేశారు.

చదవండి :  దమ్ముంటే నా మీదకు రా? కడప నడిబొడ్డులో తేల్చుకుందాం ...

జిల్లా పర్యాటక శాఖాధికారి జి.గోపాల్‌ మాట్లాడుతూ పర్యాటక రంగాభివృద్ధికి అందరం పాటు పడాలన్నారు. హరిత టూరిజం హోటల్స్‌ డివిజనల్‌ మేనేజర్‌ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ జిల్లా పర్యాటక ప్రాచుర్యానికి ప్రతి ఒక్కరం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఇంటాక్‌ కన్వీనర్‌ ఇలియాస్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా సంస్కృతి తెలిపేలా విద్యార్థులకు పలు అంశాల్లో పోటీలు నిర్వహించడంతో పాటు నగరంలోని విద్యా సంస్థల్లో హెరిటేట్‌ క్లబ్‌లు ఏర్పాటు చేశామన్నారు.

కార్యక్రమంలో బాషా పరిశోధకుడు కట్టా నరసింహులు, సాహితీ వేత్త తవ్వా ఓబులరెడ్డి, ఇంటాక్‌ సభ్యులు రామాంజులరెడ్డి, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ మస్తాన్‌, పర్యాటక ప్రేమికులు పద్మప్రియ, చంద్రారెడ్డి, రెడ్డమ్మ, సురేష్‌, తదితరులు పాల్గొన్నారు. నేడు ఫుడ్‌ ఫెస్టివల్‌, పర్యాటకోత్సవ సమాపనోత్సవంలో ముఖ్య అతిథిగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ సతీష్‌రెడ్డి, కలెక్టర్‌, ఎస్పీ తదితరులు హాజరు కానున్నట్లు సమాచారం.

చదవండి :  విభజనోద్యమం తప్పదు

ఇదీ చదవండి!

సిద్దేశ్వరం ..గద్దించే

దావలకట్టకు చేరినాక దారిమళ్ళక తప్పదు (కవిత)

పౌరుషాల గడ్డన పుట్టి పడిఉండటం పరమ తప్పవుతుందేమో కాని ..! కుందేళ్ళు కుక్కలను తరిమిన సీమలో ఉండేలులై విరుచుకపడటం తప్పే …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: