ఆదివారం , 6 అక్టోబర్ 2024

జగన్‌కు సాయం చేస్తా….

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తన అల్లుడు సజ్జల శ్రీధర్‌రెడ్డికి మద్దతిచ్చి బలపరచాలని నంద్యాల ఎంపీ ఎస్‌పీవై.రెడ్డి కోరారు. కడప నగరంలోమాజీ కార్పొరేటర్లు, జగన్‌వర్గ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్‌పీవై.రెడ్డి మాట్లాడుతూ..

దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి తనకు చాలా సన్నిహితుడని చెప్పారు. తాను అడిగిన వెంటనే వైఎస్ జగన్ మాజీ డీసీసీ అధ్యక్షుడు కె.సురేష్‌బాబును పోటీ నుంచి విరమింపజేసి, తన అల్లుడు సజ్జల శ్రీధర్‌రెడ్డికి మద్దతు ప్రకటించడం సంతోషకరమన్నారు.

శ్రీధర్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరగానే అంగీకరించినందుకు వైఎస్.జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సమయం వచ్చినప్పుడు జగన్‌కు తప్పకుండా సాయం  చేస్తానన్నారు.

చదవండి :  72.71 శాతం పోలింగ్ నమోదు

నంద్యాలలో లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ ద్వారా పైపులు, ఇంజన్లు బాడుగకు ఇచ్చి రైతులకు సాయపడుతున్నామన్నారు. వర్షాధార జిల్లాలైన అనంతపురం, వైఎస్‌ఆర్ జిల్లాలో కూడా ఇలాంటి కార్యక్రమాలు అవసరమన్నారు.

రాయలసీమను అభివృద్ధి చేయడానికి మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి కృషిచేశారని, తాము కూడా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తామన్నారు. మీరు జగన్ వర్గంలో చేరుతున్నారా అని విలేకరులు ప్రశ్నించగా.. తాను కాంగ్రెస్ వాదినని, ఓట్లు అడగడానికి టీడీపీ వాళ్లింటికి కూడా వెళతానని ఎస్పీవై.రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో రోటరీ క్లబ్ గవర్నర్ రామలింగారెడ్డి, శ్రీధర్‌రెడ్డి తండ్రి లక్ష్మిరెడ్డి, తుమ్మలకుంట శివశంకర్, ఎస్‌బి అంజద్‌బాష, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.

చదవండి :  జగన్ పాదయాత్ర మొదలయింది...

మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా ఎస్పీవై.రెడ్డి నంది పైపుల పరిశ్రమ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. శ్రీధర్‌రెడ్డికి కూడా సమాజానికి ఏదో ఒకటి చేయాలనే తపన ఉందన్నారు. యువనేత వైఎస్.జగన్ ఆదే శాల మేరకు అందరూ శ్రమించి శ్రీధర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

పీసీసీ మాజీ కార్యదర్శి తుమ్మలకుంట శివశంకర్, మాజీ కార్పొరేటర్ ఎస్‌బి అంజద్‌బాష, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కట్టా నరసింహరావు, నాయి బ్రాహ్మణ సంఘం యానాదయ్య, ఎన్జీవో సంఘం అధ్యక్షుడు శివారెడ్డి, ప్రైవేటు పాఠశాలల కరెస్పాండెంట్ల సంఘం అధ్యక్షుడు ఎంవి రామచంద్రారెడ్డి, ఎంపీ సురేష్ ప్రసంగించారు.

చదవండి :  జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా గంటా?

కార్యక్రమం లో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంప్రసాద్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు హరినారాయణ, కరీం జిలానీ, సర్దారి, పవన్, చల్లా క్రిష్ణయ్య, బివిటి ప్రసాద్, సురసుర భాగ్యమ్మ, పుత్తా వెంకటసుబ్బారెడ్డి, పత్తి రాజేశ్వరి, జగన్ వర్గ నాయకులు వేణుగోపాల్‌నాయక్, బసవరాజు, అబ్దుల్ కలాం, బండి ప్రసాద్, టీపీ వెంకటసుబ్బమ్మ, ఉమామహేశ్వరి, చిన్నయ్య, పాల్గొన్నారు.

ఇదీ చదవండి!

క్రిమినల్ కేసుల్లో ఇరికించాలని సీబీఐ ముందుగానే నిర్ణయించుకుందని నాకు సమాచారముంది…

‘‘యూపీఏ ప్రభుత్వం తనను రాజకీయంగా కానీ, మరో రకంగానైనా కానీ ఏ రూపంలో వ్యతిరేకించే వారినైనా.. అణచివేయటానికి, అప్రతిష్టపాలు చేయటానికి, …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: