చెంచు నాటకం

అలరించిన ‘చెంచు నాటకం’

మైదుకూరు మండలం యెన్.యర్రబల్లెలో ఉగాది సందర్భంగా (అదే రోజు) సోమవారం రాత్రి జరిగిన శ్రీ జనార్ధనస్వామి తిరుణాళలో ప్రదర్శించిన చెంచు (చెంచులక్ష్మి వీధిబాగవతం) నాటకం ప్రేక్షకులను అలరింపచేసింది. అలయ ధర్మకర్త పగిడి రంగయ్య దాసు ఆధ్వర్యంలో ఈ తిరుణాల , వీధి నాటక ప్రదర్శన జరిగింది.

రాత్రి 10 గంటలనుండి తెల్లవారు జామున 4 గంటల దాకా జరిగిన ఈ చెంచు నాటకాన్ని వందలాది మంది ప్రేక్షకులు కదలకుండా ఆసక్తిగా తిలకించడం విశేషం. ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి, ఎరుకసాని పాత్రలను పురుషులే పోషించి చెంచు నాటకాన్ని ఆద్యంతం రక్తి కట్టించారు. ప్రాచీన కళలకు ఇంకా ఆదరణ తగ్గలేదనడానికి ఈ నాటక ప్రదర్శనే ఒక తార్కాణం.

చదవండి :  అల్లుడికి ఘనంగా భత్యం సమర్పించిన కడప ముస్లింలు

గరుడాచల మహాత్మ్యంలోని ఇతి వృత్తాన్ని, పాటల్ని తీసుకుని జానపదులు ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారు. ఇందులో నాటకం, నృత్యం రెండూ కలిసి వుంటాయి. హర్మోనియం, గజ్జలు, తాళాలు మాత్రమే ప్రదర్శనంలో ఉపయోగిస్తారు.

చెంచు నాటకం
చెంచు నాటకంలో ఓ సన్నివేశం

ఈనాటకంలో సింగి నాయకుడు …… రంభ …….. ఊర్వశి, నరసింహస్వామి ……….ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి, ఎరుకలసాని (సింగి) సింగడు, ద్వారపాలకులు వుంటారు. వారే కిరీటాల్ని ……… భుజకీర్ఫ్త్గులను తయారు చేసు కుంటారు. పౌరుషులే స్త్రీ పాత్రలను ధరిస్తారు.పాత్రధారు లందరూ వేషాలు ధరించిన తరువాత మిగిలినవారు వంతలుగా నిలబడతారు. ప్రతి పాత్రధారీ ప్రవేశించి గుండ్రంగా తిరుగుతూ వయ్యారంగా చేతులు వూపుతూ, కూర్చుని లేస్తూ వుంటారు.

చదవండి :  రేపూ...మన్నాడు ఆస్థానే మురాదియాలో ఉరుసు ఉత్సవాలు

చెంచు నాటకం

నరసింహస్వామి పాత్రధారి ఠీవిగా చేతుల్ని త్రిప్పుతూ, రౌద్ర రూపంలో అడుగులు వేస్తూ కళ్ళప్పగించి చూడటం అభినయిస్తాడు. నరసింహ స్వామి తో అదిలక్ష్మి, చెంచులక్ష్మిల సంవాదం. ఆతను ఏమీ తెలియనివాని వలె ఉండటం, చెంచు లక్ష్మి ఈ విషయాన్ని ఎరుకలసాని (సింగి) ఆదిలక్ష్మికి చెప్పటం ముఖ్యమైన కథ. ప్రకాశం జిల్లా , కందుకూరు తాలూకా, పాలూరుగ్రా మానికి చెందిన మాల్యాద్రి నిర్వహణలో ఈ చెంచు నాటక ప్రదర్శన జరిగింది.

చెంచునాటకం

పొన్నలూరు మండలం, వెంకుపాలెం గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి పాత్రధారి కోటేశ్వర రావు స్త్రీ పాత్రాభినయంతో ప్రేక్షకులను రంజింప చేశారు.

చదవండి :  నేడు హనుమజ్జయంతి

చెంచునాటకం

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: