చీరలియ్యగదవోయి చెన్నకేశవా – అన్నమయ్య సంకీర్తన

గండికోట చెన్నకేశవుని స్తుతించిన అన్నమయ్య సంకీర్తన

చెన్నకేశవుని యెడల అపారమైన భక్తిప్రపత్తులు కలిగిన అన్నమయ్య తన కీర్తనలలో ఆ స్వామిని స్తుతించి తరించినాడు. విజయనగర సామ్రాజ్య కాలంలో వేలుగులీని హైందవ సంప్రదాయానికీ, సంస్కృతికీ ప్రతీకగా నిలిచిన గండికోటలో చెన్నకేశవుని ఆలయం ఒకటి ఉండేది. ఈ ఆలయాన్ని దర్శించిన అన్నమయ్య ఇక్కడి చెన్నకేశవుడిని ఈ విధంగా స్తుతిస్తున్నాడు…

రాగం: సామంత

కీర్తన సంఖ్య: ౩౧౪(314), ౨౭ (27) వ రాగి రేకు

పల్లవి: చీరలియ్యగదవోయి చెన్నకేశవా! చూడు
చేరడేసి కన్నుల వో చెన్నకేశవా

చదవండి :  వైఎస్ హయాంలో కడపకు దక్కినవి

చరణం: పొత్తుల మగడవై పొరచినవ్వు నవ్వేవు
చిత్తడి గుణములేలో చెన్నకేశవా
చిత్తరు పతిమలమై సిగ్గు నీకొప్పించితి
నీ చిత్తము నా భాగ్యము చెన్నకేశవా ||చీర||

చరణం: యెమ్మెలకు జవ్వనాన ఇంతగాగ నోమితిమి
చిమ్మవోయి నీ కరుణ చెన్నకేశవా
కమ్మటి నవ్వేవు మాతో కడలేదు నీయాస
చిమ్ముచెమటల ఓ చెన్నకేశవా ||చీర||

చరణం: గరిమలందరినొక్క గాడిగట్టి గూడితివి
శిరసు పూవులు రాల చెన్నకేశవా
ఇరవై శ్రీ వేంకటాద్రి ఇదివంటా గూడితివి
గోరాబు చేతల గండికోట చెన్నకేశవా ||చీర||

చదవండి :  ఇందరికి నభయంబు లిచ్చుచేయి - అన్నమయ్య సంకీర్తన

సంకీర్తన వినండి:

ఇదీ చదవండి!

సొంపుల నీ

సొంపుల నీ వదనపు సోమశిల కనుమ – అన్నమయ్య సంకీర్తన

వర్గం : శృంగార సంకీర్తనలు ॥పల్లవి॥ సొంపుల నీ వదనపు సోమశిల కనుమ యింపులెల్లఁ జేకొనఁగ నిల్లు నీపతికి ॥చ1॥ …

ఒక వ్యాఖ్య

  1. very interesting &exiting place. I want history of gandikota information to my email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: