చంద్రబాబు చెప్పిందే మళ్ళీ చెప్పారు

కడప: ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం జిల్లాలో వివిధ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.ముందుగా కడప నగరంలో కొత్త సచివాలయ భవనాన్ని (కలెక్టరేట్) ఆయన ప్రారంభించారు. అనంతరం ఒంటిమిట్ట సమీపంలో రూ.34కోట్లతో నిర్మించిన శ్రీరామ ఎత్తిపోతల పథకం పైలాన్‌ను రాత్రి ఆవిష్కరించారు.

కలెక్టరేట్ ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…పట్టిసీమ నిర్మాణంతో వంద టీఎంసీల నీటిని వాడుకోవచ్చన్నారు. శ్రీశైలం నీటిని పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ జిల్లాలకు తరలించవచ్చన్నారు. శ్రీశైలం జలాలతో గండికోట జలాశయం నింపి అక్కడ నుంచి ఎత్తిపోతల పథకాల ద్వార జిల్లాకు నీటిని తీసుకోవచ్చన్నారు.

గండికోట, చిత్రావతి, పీబీసీ ప్రాజెక్టులు త్వరలో పూర్తవుతాయని చెప్పారు. జీఎన్‌ఎస్‌ఎస్‌-2 త్వరలో ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అన్ని సకాలంలో పూర్తిచేసి జిల్లాను సస్యశ్యామలంగా చేస్తామని భరోసా ఇచ్చారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ వస్తే రాయచోటికి తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు.

చదవండి :  నవోదయ ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 31

గత పాలకుల కారణంగా జిల్లాకు వచ్చే పరిశ్రమలు వెనక్కి పోయే పరిస్థితి వచ్చిందన్నారు. జిల్లాకు ఉక్కు పరిశ్రమ, సిమెంటు పరిశ్రమలు, ఇతర పరిశ్రమలు తీసుకొస్తామన్నారు.

ఒంటిమిట్ట శ్రీరామ ఎత్తిపోతల పథకం పైలాన్‌ ఆవిష్కరణ చేసిన తర్వాత మాట్లాడుతూ..ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలో శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి ప్రారంభించామన్నారు. ఒంటిమిట్ట ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని, పర్యటక పరంగాను ఒంటిమిట్టకు రాష్ట్రంలోనే గుర్తింపు వచ్చేలా చూస్తామన్నారు. ఈ విషయమై త్వరలో తితిదే అధికారులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.

ఈ ఏడాదిలో గాలేరు నగరి తొలి దశను పూర్తిచేయబోతున్నామన్నారు. రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేసి కరవు లేకుండా చేస్తామన్నారు.   కడప జిల్లా అభివృద్ధిపై దృష్టిపెట్టామని, గతంలో మాట ఇచ్చినట్లు జిల్లాలో అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పారు.

మొత్తానికి ముఖ్యమంత్రి గారు కడప జిల్లా వాసులకు ఏమైనా కొత్తగా చెప్పారా?

చదవండి :  మా పిల్లోల్లకు 48 గంటల్లో క్షమాపణ చెప్పాల

ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం జిల్లాలో వివిధ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.ముందుగా కడప నగరంలో కొత్త సచివాలయ భవనాన్ని (కలెక్టరేట్) ఆయన ప్రారంభించారు. అనంతరం ఒంటిమిట్ట సమీపంలో రూ.34కోట్లతో నిర్మించిన శ్రీరామ ఎత్తిపోతల పథకం పైలాన్‌ను రాత్రి ఆవిష్కరించారు.

కలెక్టరేట్ ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…పట్టిసీమ నిర్మాణంతో వంద టీఎంసీల నీటిని వాడుకోవచ్చన్నారు. శ్రీశైలం నీటిని పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ జిల్లాలకు తరలించవచ్చన్నారు. శ్రీశైలం జలాలతో గండికోట జలాశయం నింపి అక్కడ నుంచి ఎత్తిపోతల పథకాల ద్వార జిల్లాకు నీటిని తీసుకోవచ్చన్నారు.

గండికోట, చిత్రావతి, పీబీసీ ప్రాజెక్టులు త్వరలో పూర్తవుతాయని చెప్పారు. జీఎన్‌ఎస్‌ఎస్‌-2 త్వరలో ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అన్ని సకాలంలో పూర్తిచేసి జిల్లాను సస్యశ్యామలంగా చేస్తామని భరోసా ఇచ్చారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ వస్తే రాయచోటికి తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు.

చదవండి :  విపక్ష నేత సీమ గురించి మాట్లాడారోచ్!

గత పాలకుల కారణంగా జిల్లాకు వచ్చే పరిశ్రమలు వెనక్కి పోయే పరిస్థితి వచ్చిందన్నారు. జిల్లాకు ఉక్కు పరిశ్రమ, సిమెంటు పరిశ్రమలు, ఇతర పరిశ్రమలు తీసుకొస్తామన్నారు.

ఒంటిమిట్ట శ్రీరామ ఎత్తిపోతల పథకం పైలాన్‌ ఆవిష్కరణ చేసిన తర్వాత మాట్లాడుతూ..ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలో శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి ప్రారంభించామన్నారు. ఒంటిమిట్ట ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని, పర్యటక పరంగాను ఒంటిమిట్టకు రాష్ట్రంలోనే గుర్తింపు వచ్చేలా చూస్తామన్నారు. ఈ విషయమై త్వరలో తితిదే అధికారులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.

ఈ ఏడాదిలో గాలేరు నగరి తొలి దశను పూర్తిచేయబోతున్నామన్నారు. రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేసి కరవు లేకుండా చేస్తామన్నారు.   కడప జిల్లా అభివృద్ధిపై దృష్టిపెట్టామని, గతంలో మాట ఇచ్చినట్లు జిల్లాలో అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పారు.

ఇదీ చదవండి!

emperor of corruption

ఎంపరర్ ఆఫ్ కరప్షన్ ఈ-పుస్తకం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ పేర వైఎస్సార్ కాంగ్రెస్ ప్రచురించిన పుస్తకం. ఈ పుస్తకాన్ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: