
ఘనమనోరాజ్యసంగతి చెలఁగినఁగాని – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఘనమనోరాజ్యసంగతి చెలఁగినఁగాని జనుల కెప్పుడు నాత్మసౌఖ్యంబు లేదు ॥చ1॥ ప్రతిలేనిధైర్యంబు పదిలపరచినఁ గాని మతిలోనిపగవారిమద మణఁపరాదు మితిలేనిశాంతమనుమేఁటికైదువఁ గాని క్రితకంబువిషయముల గెలుపెరఁగరాదు ॥చ2॥ సొరిది నిర్మోహమనుజోడు దొడిగినఁ గాని వెరపుడిగి మమతచే వెళ్లఁబడరాదు యిరవైన విజ్ఞానపింట నుండినఁ గాని అరసి జగమెల్ల తానై యేలరాదు ॥చ3॥ యిన్నియునుఁ దిరువేంకటేశుఁ డిచ్చినఁ గాని తన్నుఁదానెరిఁగి యాతనిఁగొలువరాదు కన్నులను వెలి లోను గలయఁజూచిన గాని సన్నంబుఘనమనెడిజాడ గనరాదు |
రాగము: సామంతం రేకు: 0049-06 సంపుటము: 1-303 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతం