గండికోటలో 274 కోట్ల తో పవన విద్యుత్తు ప్రాజెక్టును నిర్మిస్తున్న” నాల్కో”

నేషనల్ అల్యూమియం కంపెనీ లిమిటెడ్ ( నాల్కో ) వై.ఎస్.ఆర్ జిల్లా లోని గండికోటలో 274 కోట్ల రూపాయల వ్యయంతో 50.4 ఎం.వి. పవన విద్యుత్ ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించింది.   ఈ ప్రాజెక్టును సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ 274 కోట్ల రూపాయల వ్యయంతో నిర్వహిస్తుందని నాల్కో సి.ఎం.డి బాగ్రా భువనేశ్వర్ లో ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కోసం ఒక్కొక్కటి 2.1 ఎం.వి. సామర్థ్యంతో 24 గాలిమరలను గండికోట సమీపంలో ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని 8 నెలల్లో పూర్తి చేసి ఇక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్తును రాష్ట్ర విద్యుత్ గ్రిడ్ కు విక్రయిస్తారు.

చదవండి :  5న భాజపా ఆధ్వర్యంలో ఛలో సిద్దేశ్వరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: