అనంతపురం గంగమ్మ దేవళం
అనంతపురం గంగమ్మ దేవళం

లక్కిరెడ్డిపల్లి గంగ జాతర మొదలైంది

రాయచోటి: అనంతపురం (లక్కిరెడ్డిపల్లి) గంగమ్మ జాతర ఈ పొద్దు (బుధవారం) ప్రారంభమైంది. గుడిలో గంగమ్మవారికి శాస్త్రోక్తంగా దీపం వెలిగించి పూజలు నిర్వహించి చెల్లోల్ల వంశీయులు అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం బుధవారం తెల్లవారుజామున బోనాలు సమర్పించారు.

ఆలయానికి సమీపంలో ఉన్న గొల్లపల్లిలోని చెల్లోల్లు వంశీయులు అమ్మ వారికి సోమవారం అర్ధరాత్రి ప్రత్యేకంగా పూజలు జరిపించారు. అనంతరం గ్రామంలో వూరేగింపు నిర్వహించి చౌటపల్లి, కొత్తపల్లిల మీదుగా గంగమ్మను ప్రధాన ఆలయానికి తీసుకొచ్చారు

బుధ, గురు, శుక్రవారాల్లో గంగమ్మ జాతర నిర్వహిస్తారు. భక్తులకు బుధవారం నుంచే అమ్మవారు దర్శనమిస్తారని ఈవో సురేష్‌కుమార్‌రెడ్డి చెప్పారు. భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని వారు పేర్కొన్నారు.జాతర సందర్భంగా ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినారు.

చదవండి :  నేడు హనుమజ్జయంతి

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: