కడప క్రికెట్ స్టేడియం

కడప (వైఎస్ రాజారెడ్డి) క్రికెట్ స్టేడియం

కడప నగర పరిధిలోని పుట్లంపల్లెలో 11.6 ఎకరాల్లో రూ. 8 కోట్లతో కడప క్రికెట్ స్టేడియం ( వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానం) ఏర్పాటైంది. ఆంధ్ర క్రికెట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఈ  మైదానం నిర్మితమైంది.

2007లో అప్పటి ముఖ్యమంత్రి డా. వైఎస్‌ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేయడంతో పాటు ఆయన తండ్రి రాజారెడ్డి జ్ఞాపకార్థం రూ.50 లక్షల మూలనిధిని ఈ స్టేడియం నిర్మాణం కోసం అందజేశారు. దీంతో 2009లో ప్రారంభమై 2011 నాటికి మైదానం అందుబాటులోకి వచ్చింది.

చదవండి :  కడప నగరం

కడప క్రికెట్ స్టేడియంలో జరిగిన రంజీ మ్యాచ్ లు :

2011 డిసెంబర్‌ 6 నుంచి 9 వరకు తొలి రంజీ మ్యాచ్‌ ఆంధ్రా–విదర్భ జట్ల మధ్య సాగింది.

2012 డిసెంబర్‌ 29 నుంచి 2013 జనవరి 1వ తేదీ వరకు ఆంధ్రా–కేరళ జట్ల మధ్య రెండో రంజీ నిర్వహించారు.

2013 నవంబర్‌ 28 నుంచి డిసెంబర్‌ 1 వ తేదీ వరకు మూడో రంజీ మ్యాచ్‌ ఆంధ్రా–మహారాష్ట్ర జట్ల మధ్య సాగింది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: