భాషల అభివృద్ధి మండలి సభ్యునిగా కేతు విశ్వనాథరెడ్డి

ఆచార్య డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి

భాషల అభివృద్ధి మండలి సభ్యునిగా కేతు విశ్వనాథరెడ్డి

భారతీయ భాషల అభివృద్ధికి కృషి చేసే జాతీయ మండలి సభ్యునిగా తెలుగు భాషకు సంబంధించి ప్రముఖ రచయిత కేతు విశ్వనాథరెడ్డి నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. కాగా, భారతీయ భాషల అభివృద్ధికి కౌన్సిల్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్(సీసీఐఎల్) కృషి చేస్తోంది. దీనికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (1996) గ్రహీత. డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ సంచాలకునిగా పదవీ విరమణ పొందిన వీరు 1939 జులై 10న కడప జిల్లా కమలాపురం తాలూకాలోని రంగసాయిపురం గ్రామంలో జన్మించారు. ‘కేతు విశ్వనాథరెడ్డి కథలు’,’ జప్తు’, ‘ఇఛ్చాగ్ని’ పేర్లతో వీరి కథలు సంకలనాలుగా వెలువడ్డాయి. ‘కడప జిల్లా గ్రామ నామాల చరిత్ర’ అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను వీరు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు.

చదవండి :  రాజంపేట పట్టణం

 

[box type=”info” ]

 కేతు విశ్వనాథ రెడ్డి గారికి కడప జిల్లా ప్రజల తరపున అభినందనలు!!

– www.www.kadapa.info

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *